
సాక్షి, కడప : లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగెనూరు, ధర్మాపురం గ్రామాల్లో ఇంటింటికి 13వస్తువులతో కూడిన ప్యాకెట్లను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. మండలంలోని 14 గ్రామాల్లో 14వేల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్టు ఎంపీ అవినాష్‌రెడ్డి తెలిపారు.
గొరిగెనూరు గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి గ్రామంలోని పేదలు ఇబ్బంది పడుతున్నారని సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గ్రామానికి వచ్చి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఎవరూ ఆందోళనకు గురికావొద్దని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించి వైరస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment