
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఇక, తాజాగా జమ్మలమడుగులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త హనుమంతు రెడ్డిపై దాడి చేశారు.
అయితే, జమ్మలమడుగు మండల పరిధిలోని పెద్ద దండ్లూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త హనుమంతు రెడ్డిపై 2018లో కొందరు టీడీపీ నేతలు దాడి చేశారు. దీంతో, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా హనుమంతు రెడ్డి ఈరోజు జమ్మలమడుగు వచ్చాడు.
ఈ నేపథ్యంలో ఈ కేసులో రాజీపడాలని హనుమంతుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. హనుమంతు మాత్రం ఒప్పుకోకపోవడంతో ఆయన ఇంటికి వెళ్తుండగా మాటు వేసి మార్గమధ్యంలో టీడీపీ నేతలకు దాడులకు తెగబడ్డారు. పచ్చ మూక దాడిలో హనుమంతుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో నాటకీయ పరిణామాలు..
Comments
Please login to add a commentAdd a comment