వేగంగా వెళ్తున్న ఓ మిని లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో 30 మంది గాయపడ్డారు.
జమ్మలమడుగు(వైఎస్సార్ జిల్లా): వేగంగా వెళ్తున్న ఓ మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో 30 మంది గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోట రహదారిపై బీఆర్ కొట్టాల గ్రామం సమీపంలో జరిగింది. వివరాలు.. బీఆర్ కొట్టాల గ్రామానికి చెందిన 30 మంది తమ సమీప బంధువు కర్మకాండకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ కొట్టాల గ్రామ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో లారీలో ఉన్న 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరిని జమ్మలమడుగు ప్రభుత్వాస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.