ఓ ఫైవ్ స్టార్ హోటల్ గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్న 18 మందిని పోలీసుల అరెస్ట్ చేశారు
ఫైవ్ స్టార్ హోటల్ లో గ్యాంబ్లింగ్, 18 మంది అరెస్ట్!
Published Mon, Sep 1 2014 8:48 PM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM
న్యూఢిల్లీ: ఓ ఫైవ్ స్టార్ హోటల్ గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్న 18 మందిని పోలీసుల అరెస్ట్ చేశారు. దేశరాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్టీట్ ప్రాంతంలోని ఓ హోటల్ లో గ్యాంబ్లింగ్ పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
బోర్డుపై 1.10 లక్షలు సొమ్ము, 1.06 నగదును గ్యాంబ్లర్ల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ బీఎస్ త్యాగి వెల్లడించారు. గ్యాంబ్లర్లపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామన్నారు.
ఈ వ్యవహారంలో హోటల్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తామని.. గ్యాంబ్లింగ్ కు హోటల్ యాజమాన్యం సహకరిస్తే వారిని కూడా శిక్షిస్తామని త్యాగి తెలిపారు.
Advertisement
Advertisement