Parliament street
-
ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో TUWJ ధర్నా
-
దూసుకొస్తున్న జిగ్నేష్.. టెన్షన్.. టెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ : ఓ పక్క వాటర్ కెనాన్లు, భారీ కేడ్లు, బాష్ప వాయుగోళాలు, లాఠీలు పుచ్చుకొని నిల్చున్న పోలీసులు.. మరోవైపు పెద్ద పెట్టున నినాదాలతో, మద్దతుదారులతో దూసుకొస్తున్న దళిత నేత జిగ్నేష్ మేవానీ. మొత్తానికి పార్లమెంటు వీధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల ఆదేశాలను లెక్కచేయకుండా ర్యాలీకోసం పార్లమెంటు వీధిలో జిఘ్నేష్ మేవాని బయలుదేరారు. పలు నిర్బంధాలను చేధించుకొని ఆయన పార్లమెంటు వీధికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ ర్యాలీ కోసం దాదాపు 600మంది మద్దతు దారులు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు వీధి నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం వరకు రాజ్యాంగం కాపీలతో, మనస్మృతి కాపీలతో 'యువ హంకార్ ర్యాలీ' నిర్వహించి తీరుతామని మేవానీ ప్రకటించారు. అయితే, గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో పార్లమెంటు వీధిలో ఆంక్షలు ఉన్నాయని, అక్కడ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ర్యాలీలు నిర్వహిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ, మేవానీ, ఆయనకు మద్దతుగా అస్సాం రైతుల హక్కుల పోరాట ఉద్యమ నేత అఖిల్ గొగోయ్ మరికొందరు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ర్యాలీ కోసం కార్యకర్తలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా.. ఈ ర్యాలీ కోసం దాదాపు 10 వేలమంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు వారిని నిలువరించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. పార్లమెంటు స్ట్రీట్ మొత్తం హైసెక్యూరిటీ జోన్‌గా ప్రకటించడం మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల కొన్ని మెట్రో సర్వీసులు రద్దు చేశారు. విద్య, ఉద్యోగాలు, లింగ సమానత్వంవంటి అంశాలపై పోరాటం చేస్తున్న దళిత సంస్థ బీమ్ ఆర్మీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. -
ఫైవ్ స్టార్ హోటల్ లో గ్యాంబ్లింగ్, 18 మంది అరెస్ట్!
న్యూఢిల్లీ: ఓ ఫైవ్ స్టార్ హోటల్ గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్న 18 మందిని పోలీసుల అరెస్ట్ చేశారు. దేశరాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్టీట్ ప్రాంతంలోని ఓ హోటల్ లో గ్యాంబ్లింగ్ పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బోర్డుపై 1.10 లక్షలు సొమ్ము, 1.06 నగదును గ్యాంబ్లర్ల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ బీఎస్ త్యాగి వెల్లడించారు. గ్యాంబ్లర్లపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంలో హోటల్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తామని.. గ్యాంబ్లింగ్ కు హోటల్ యాజమాన్యం సహకరిస్తే వారిని కూడా శిక్షిస్తామని త్యాగి తెలిపారు. -
పార్లమెంటు స్ట్రీట్ వద్ద జగన్ అరెస్ట్
-
ఢిల్లీ వీధుల్లో సమైక్య సమరం : పార్లమెంటు స్ట్రీట్ వద్ద జగన్ అరెస్ట్
ఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని పార్లమెంటు స్ట్రీట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంటు స్ట్రీట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జంతర్ మంతర్ వద్ద ఆ పార్టీ చేపట్టిన సమైక్య ధర్నా కార్యక్రమంలో జగన్ ప్రసంగం ముగిసిన తరువాత కాలినడకన పార్లమెంటుకు బయలు దేరారు. ఎక్కడ వరకు అనుమతిస్తే అక్కడ వరకు వెళదామని జగన్ పిలుపు ఇవ్వడంతో ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు అందరూ ఆయన వెంట నడిచారు. ఢిల్లీ వీధుల్లో సమైక్య సమరం సాగింది. ఢిల్లీ వీధులన్నీ సమైక్య నినాదాలతో దద్దరిల్లాయి. కేంద్రానికి, సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమైక్యవాదులు పార్లమెంటు స్ట్రీట్ వద్దకు చేరుకునే సరికి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ సిపి నాయకులు అక్కడే కింద కూర్చున్నారు. భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. పోలీసులు వాటర్ క్యాన్లు, బాష్పవాయువులు సిద్ధం చేశారు. కార్యకర్తలను అడ్డుకోవడంతో పోలీసులకు, జగన్‌కు మధ్యలో వాగ్వాదం జరిగింది. ఆ తరువాత పోలీసులు జగన్‌ను అరెస్ట్ చేశారు. జగన్ తోపాటు పలువురు పార్టీ నేతలకు కూడా పో్లీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.