యథేచ్ఛగా పేకాట శిబిరాలు
యథేచ్ఛగా పేకాట శిబిరాలు
Published Fri, Sep 2 2016 11:18 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
కొంత మంది పోలీసుల సహకారం
సామాజిక మాధ్యమంలో
పోలీసుల ప్రమేయంపై కథనాలు
హెచ్‌సీపై శాఖాపరమైన చర్యలు
గన్నవరం :
అధికార పార్టీ అండదండలతో నిర్వహిస్తున్న పేకాట శిబిరానికి సహకరిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌పై శాఖ పరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. వివరాలు.. మండలంలోని అల్లాపురంలో అధికార పార్టీ నాయకుల అండతో కొంత కాలంగా పెద్ద ఎత్తున్న పేకాట శిబిరం నడుస్తోంది. స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన స్పందించిన దాఖలాలు లేదు. నాలుగు రోజుల క్రితం నేరుగా ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయభాస్కర్‌కు ఫోన్‌లో సమాచారం అందించారు. దీంతో స్వయంగా ఏసీపీ రంగంలోకి దిగి కంకిపాడు సీఐ శ్రీధర్‌కుమార్, ఇతర సిబ్బందితో కలిసి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పేకాట శిబిరంపై దాడికి వెళ్లారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న గన్నవరం పోలీస్‌స్టేçÙన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.వెంకటేశ్వరరావు పేకాట శిబిరం నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో ఏసీపీ పేకాట శిబిరం వద్దకు చేరుకునేలోపే జూదరులు అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం ఇచ్చిన వారిపై విచారణ..
జూదరులకు సమాచారం చేరడంతో అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తర్వాత రోజే హెడ్ కానిస్టేబుల్‌ను ఏసీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు. అంతే కాకుండా శుక్రవారం సదరు హెడ్ కానిస్టేబుల్‌ను శాఖ పరమైన చర్యల్లో భాగంగా రైల్వేకు డూయింగ్ డ్యూటీకి పంపించారు. అయితే గన్నవరం ప్రాంతంలో జరుగుతున్న పేకాట శిబిరాలకు గన్నవరం సీఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు సహకరిస్తున్నట్లు ఏసీపీకి లిఖిత పూర్వకమైన ఫిర్యాదు కూడా అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుపై వాస్తవాలను తెలుసుకునేందుకే ఏసీపీ స్వయంగా పేకాట శిబిరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
సామాజిక మాధ్యమంలో..
పేకాట శిబిరం నిర్వాహకులతో గన్నవరం పోలీసులకు ఉన్న సంబంధలపై వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ ఆడియో రికార్డు ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఓ కానిస్టేబుల్‌తో పేకాట శిబిరం నిర్వాహకుడు మాట్లాడిన ఏసీపీ దాడులకు సంబంధించిన సంభాషణలు ఈ వాయిస్ మేసేజ్‌లో ఉన్నాయి. సదరు నిర్వాహకుడు దాడి సంఘటనపై సీఐతో కూడా మాట్లాడినట్లు ఆడియో రికార్డుల్లో చెప్పుకు వచ్చాడు. ఏసీపీ తనతో ఒకమాటా కూడా చెప్పకుండా వచ్చాడు. ఆయన మీరేమి భయపడనవరసం లేదని సార్ హామీ ఇచ్చినట్లు సదరు పేకాట నిర్వాహకుడు మాట్లాడిన వాయిస్ రికార్డు ఉంది. ప్రస్తుతం ఈ వాట్సాప్ మేసేజ్ పోలీస్ శాఖలో పలువురు ఉన్నతాధికారులకు కూడా వెళ్లినట్లు సమాచారం.
సరెండర్ చేసిన మాటా వాస్తవమే
పేకాట శిబిరాలకు సహకరిస్తున్నారనే కారణంతో హెడ్ కానిస్టేబుల్ కె.వెంకటేశ్వరరావును ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీసీ కార్యాలయంలో సరెండర్ చేసిన మాటా వాస్తవమే. ఉన్నతాధికారులకు సహకరిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందిన విషయం కూడా వాస్తవమేనన్నారు.
– అహ్మద్‌అలీ, సీఐ
Advertisement
Advertisement