వీఆర్‌లో ఉన్న ఎస్సైపై విచారణ
Published Sat, Dec 17 2016 1:54 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
ఏలూరు (సెంట్రల్): ఇప్పటికే వీఆర్‌లో ఉన్న ఎస్సై సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేసి కేసు నమోదు చేయకపోవడంపై జిల్లా ఎస్సీ విచారణకు ఆదేశించారు. విధుల్లో అలసత్వంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల జరిగిన సమీక్షలో పెదపాడు ఎస్సైను ఎస్పీ భాస్కర్‌భూషణ్ వీఆర్‌లో పెట్టారు. నాలుగు రోజు క్రితం జిల్లా సరిహద్దులోని అప్పనవీడులోని ఓ ఇంట్లో కొందరు నేతలు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆ ఇంటినే పేకాట స్థావరంగా మార్చేశారు. విషయం తెలుసుకున్న పెదపాడు ఎస్సై నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుతో కలిసి దాడి చేసినట్టు సమాచారం. అయితే పేకాటలో పట్టుబడిన వారిని పోలీస్‌స్టేçÙ¯ŒSలో అప్పగించకుం డా స్వాధీనం చేసుకున్న సుమారు రూ.2 లక్షల నగదు తీసుకుని వెళ్లినట్టు ఎస్పీకి తెలియడంతో ఎస్‌బీ అధికారులతో విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తెలితే పెదపాడు ఎస్సైను సస్పెండ్ చేస్తామని ఎస్పీ తెలిపారు.
Advertisement