పేకాటస్థావరంపై దాడి..ఒకరి మృతి | man dies after fallingdown from building | Sakshi
Sakshi News home page

పేకాటస్థావరంపై దాడి..ఒకరి మృతి

Published Thu, Mar 2 2017 7:53 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

పేకాటస్థావరంపై దాడి..ఒకరి మృతి

పేకాటస్థావరంపై దాడి..ఒకరి మృతి

హైదరాబాద్‌సిటీ:
పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఇద్దరు పేకాటరాయుళ్లు భవనంపై నుంచి దూకారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం వేకువజామున చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాలు..గురువారం వేకువజామున ఒంటి గంట సమయంలో ఓ ఇంటి రెండో అంతస్తులో శబ్దం రావడంతో పాటు లైట్లు ఆన్‌ చేసి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి తలుపుతట్టారు.

దీంతో కంగారు పడిపోయిన ఇద్దరు పేకాట రాయుళ్లు తప్పించుకోబోయి వెనకవైపు బాల్కనీలోకి వెళ్లారు. మరో బాల్కనీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ కిందపడిపోయారు. ఇద్దరిని పోలీసులు దగ్గరలోని అనుపమా ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ శ్రీనివాస్‌(36) అనే వ్యక్తి మృతిచెందారు. ఇద్దరిదీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మామిడిపల్లి గ్రామం. స్థానికంగా ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement