
న్యూఢిల్లీ : తండ్రి వ్యాపారాన్నిస్వాధీనం చేసుకోవాలనే దుర్భుద్దితో స్నేహితులతో జతకట్టి తండ్రిని హత్య చేయించాడు ఓ దుర్మార్గపు కొడుకు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన అనిల్ ఖేరా ఓ కెమికల్ వ్యాపారవేత్త. అతని కొడుకు గౌరవ్ ఖేరా(37) వ్యాపారాలు మానేసి జూదానికి బానిసయ్యాడు. ఆటలో తన ఆస్తులన్నింటిని కోల్పోయాడు. జూదం వద్దని తండ్రి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదు. గతంలో జూదం ఆడుతూ పోలీసులకి పట్టుపడగా అనిల్ బెయిల్‌పై విడిపించాడు. అయినప్పటికి జూదాన్ని వదలలేదు. బ్యాంకుల్లో అప్పు తెచ్చి మరీ జూదం ఆడాడు.
దీంతో తండ్రి కొడుకుల మధ్య ఓ రోజు గొడవ అయింది. గౌరవ్‌ను అనిల్ అందరి ముందే తిట్టి, చేయి చేసుకున్నాడు. ఇది మనసులో పెట్టుకున్న గౌరవ్ ఎలాగైనా తండ్రిని చంపాలని పథకం పన్నారు. తండ్రిని చంపి వ్యాపారాన్ని, ఆస్తులను స్వాధీనం చేసుకుకోవాలనుకున్నాడు. హత్య కోసం అతని స్నేహితుడైన విశాల్ గార్గ్(23) సహాయం తీసుకున్నాడు. తండ్రిని హత్య చేయిస్తే తన వ్యాపారంలో 25శాతం వాటా ఇస్తానని విశాల్‌కి ఆశ చూపాడు.
దీనికి విశాల్ ఒప్పుకొని సాదిక్ ఖాన్(23) తో హత్యకు పథకం పన్నాడు. ఇందుకు గాను ఖాన్‌కు గౌరవ్ ఐదు లక్షల రూపాయలు అప్పజెప్పారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న దుండగులు..ఈ ఏడాది మే 21న అనిల్ ఖేరా ఓ మీటింగ్‌కు హాజరుకావడానికి వెళ్తుండగా తుపాకితో కాల్చి చంపారు. పోలీసుల కేసు నమోదు చేసుకొన్ని విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. కన్నకొడుకే తండ్రిని హత్య చేయించాడని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు గౌరవ్‌ని, హత్యలో పాల్గొన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment