రెడ్ హ్యాండెడ్ గా దొరికిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే | TDP MLA entrapped by police to play Gambling | Sakshi
Sakshi News home page

రెడ్ హ్యాండెడ్ గా దొరికిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Published Sun, Jul 3 2016 9:58 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

TDP MLA entrapped by police to play Gambling

పంజగుట్ట (హైదరాబాద్‌సిటీ): పేకాట ఆడుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మరో నలుగురిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5.70 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు  స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట మధుసూదన్ రావు అలియాస్ నాని అతనితో పాటు మరో నలుగురు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న హోటల్ టూరిజం ప్లాజాలో బస చేశారు.

రూం నంబర్ 508 లో మధుసూదన్తో పాటూ పలువురు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి వారిని పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement