
సాక్షి, కృష్ణా : కంచికచెర్ల మండలం మోగలూరు గ్రామంలో బుధవారం పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక ఇంట్లో రోజు పేకాట నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 13 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.44200 నగదు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.