
సాక్షి, కృష్ణా : మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలో చోటుచేసుకుంది. వివరాలు.. నీలవేణి అనే మహిళ కంచికచర్ల ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. అదే డిపార్ట్‌మెంట్‌లో నీలవేణి భర్త కూడా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా నీలవేణి శనివారం తన నివాసంలో అనుమానాస్పద స్థతిలో ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా నీలవేణి భర్త పోలీసుల అదుపులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment