నల్లగొండ జిల్లా హాలియాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు.
హాలియా: నల్లగొండ జిల్లా హాలియాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. మండల కేంద్రంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా సోమవారం తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.52 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేశారు.