పశ్చిమ గోదావరిజిల్లా చింతలపూడి పోలీసుల ఓవర్ యాక్షన్ చర్చనీయాంశమైంది. పేకాడుతూ దొరికిన ఆరుగురిని నడి రోడ్డుపై అర్ధనగ్నంగా నడిపించుకుంటూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అర్ధనగ్నంగా ఉన్న వారితోనే వారి బైక్‌లను నెట్టిపిస్తూ మూడు కిలోమీటర్లు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. సీఐ రాజేష్ ఆధ్వర్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అందరికీ అవగాహన కోసమే ఇలా చేశామంటూ పోలీసులు సమర్ధించుకుంటున్నారు.
Published Wed, Sep 13 2017 8:06 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement