అనంతపురం సెంట్రల్ : ఉరవకొండ నియోజకవర్గంలోని పీఏబీఆర్ డ్యాం పరిసర ప్రాంతం అంతర్‌జిల్లా పేకాట స్థావరానికి అడ్డాగా మారుతోంది. ఇక్కడ రోజూ రూ.కోట్లలో పేకాట సాగుతున్నట్లు సమాచారం. నియోజకవర్గ అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడు ఈ పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది కాపలాదారులను నియమించుకొని రహస్యంగా సాగిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు వాటాలు ముట్టజెప్పి వారి నోరు మూయించినట్లు తెలిసింది.