pabr dam
-
అహోబిలం రిజర్వాయర్‌కు ‘జియోమెంబ్రేన్’ చికిత్స
సాక్షి, అమరావతి: నిర్మాణ లోపాల కారణంగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) స్పిల్‌వే నుంచి భారీగా నీరు లీకవుతోంది. సీపేజీ, లీకేజీల వల్ల ఆ రిజర్వాయర్ భద్రతకే ముప్పు పొంచి ఉండటంతో అందులో సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా.. గరిష్టంగా 4.11 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచడం లేదు. దీంతో అటు ఆయకట్టుకు సాగునీరు.. ఇటు తాగునీటి అవసరాలను తీర్చలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్పిల్‌వే, మట్టి కట్టలలో చిల్లులను ‘జియోమెంబ్రేన్ షీట్ల’తో పూడ్చటం ద్వారా 11.1 టీఎంసీలు నిల్వ చేసి అనంతపురం జిల్లాకు మరింత జలభద్రత చేకూర్చాలని నిర్ణయించింది. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ)లో అంతర్భాగంగా పెన్నా నదిపై అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు వద్ద 11.10 టీఎంసీల సామర్థ్యంతో పీఏబీఆర్‌ను నిర్మించారు. కాలువ ద్వారా 50 వేలు, యాడికి కెనాల్ వ్యవస్థ ద్వారా మరో 50 వేలు కలిపి మొత్తం లక్ష ఎకరాలకు నీళ్లందించేలా ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు. స్పిల్‌వే నిండా చిల్లులే.. పీఏబీఆర్ స్పిల్‌వే పొడవు 101.44 మీటర్లు. మట్టికట్ట పొడవు 1,920 మీటర్లు. రిజర్వాయర్ వద్ద పెన్నా నది గర్భం 400 మీటర్లు. రిజర్వాయర్ స్పిల్‌వే ఎత్తు 446 మీటర్లు. ఈ రిజర్వాయర్ నిర్మాణాన్ని లోపాల పుట్టగా నీటి పారుదల నిపుణులు, జల వనరుల శాఖ అధికారులు అభివరి్ణస్తున్నారు. స్పిల్‌వే నిండా చిల్లులే ఉండటంతో రిజర్వాయర్‌లో ఏనాడూ గరిష్టంగా> నీటిని నిల్వ చేయలేని దుస్థితి. కోట్లాది రూపాయలు వెచి్చంచి గ్రౌటింగ్ (స్పిల్ వే ఎగువన బోర్లు వేసి అధిక ఒత్తిడితో సిమెంట్, కాంక్రీట్ మిశ్రమాన్ని పంపి.. చిల్లులను పూడ్చటం) చేసినా చిల్లులు పూడలేదు. లీకేజీలు, సీపేజీ తగ్గలేదు. దాంతో రిజర్వాయర్ భద్రత దృష్ట్యా గరిష్టంగా 4.11 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు. దీనివల్ల ఆయకట్టుకు నీళ్లందటం లేదు. అనంతపురం నగరంతోపాటు జిల్లాలో అధిక శాతం పట్టణాలు, గ్రామాలకు తాగునీటిని అందించే పథకాలు ఈ రిజర్వాయర్‌పైనే ఆధారపడ్డాయి. సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయకపోవడం వల్ల తాగునీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడింది. రిజర్వాయర్‌కు పునరుజ్జీవం తమిళనాడులో కడంపరై డ్యామ్, కర్ణాటకలో కృష్ణ రాజసాగర్ డ్యామ్‌లలో సీపేజీ, లీకేజీలను జియోమెంబ్రేన్ షీట్లు వేయడం ద్వారా తగ్గించారు. ఈ నేపథ్యంలో పీఏబీఆర్‌కు జియోమెంబ్రేన్ షీట్లను వేసి, లీకేజీలను అరికట్టాలన్న జల వనరుల శాఖ ప్రతిపాదనకు సర్కార్ ఆమోద ముద్ర వేసింది. అత్యంత పటిష్టమైన జియోమెంబ్రేన్ షీట్లను అధిక ఒత్తిడితో స్పిల్‌వే, మట్టి కట్టలకు ఎగువన భూమిలోకి దించుతారు. వాటి పునాది స్థాయి కంటే దిగువకు దించుతారు. ఈ షీట్లతో స్పిల్‌వేకు తొడుగు వేస్తారు. దాంతో లీకేజీలు, సీపేజీలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. అప్పుడు పీఏబీఆర్‌లో పూర్తి స్థాయిలో 11.1 టీఎంసీలను నిల్వ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. చదవండి: ‘ఎంత కృతజ్ఙత లేని వాడివి నీవు.. చంద్రం’ ఏం జరిగిందో ఏమో.. యువతి అనుమానాస్పద మృతి -
పొట్టకూటి కోసం.. చిటారు కొమ్మకు!
చింతచిగురు పప్పు, ఇగురు ఎంత రుచిగా ఉంటాయో అందరికీ తెలిసిందే. చింతాకుతో ఇంకా అనేక రకాల శాకాహార, మాంసాహార వంటలు కూడా తయారు చేస్తారు. ఆరోగ్యానికి ఎంతగానో సహకరించే ఈ చింతచిగురును సేకరించడం కష్టమైన పనే. కానీ నిరుపేదలు పొట్టకూటి కోసం కష్టమైనప్పటికీ చింతాకు సేకరించి, విక్రయించి తద్వారా వచ్చిన సొమ్ముతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. కూడేరు మండలం రామచంద్రాపురం, అరవకూరు, కూడేరుకు చెందిన పలువురు మహిళలు జల్లిపల్లి నుంచి పీఏబీఆర్ డ్యాం వరకు రోడ్డు పక్కన ఉన్న చింత చెట్లలోని చిగురు కోయడానికి పడుతున్న పాట్లు ఇవీ. - కూడేరు (ఉరవకొండ) -
పీఏబీఆర్ డ్యాంలో 2.3 టీఎంసీల నీరు
కూడేరు (ఉరవకొండ) : మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లో 2.3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ డీఈ పక్కీరప్ప పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్యాంలోకి ఇన్‌ఫ్లో పూర్తిగా బంద్ అయ్యిందన్నారు. అవుట్‌ప్లో ఉందన్నారు. డ్యాంలో ఏర్పాటు చేసిన అనంత, సత్యసాయి, శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 60 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. డ్యాంలో ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో ìనీటి మట్టం తగ్గలేదన్నారు. -
నీటి కొరత లేదు
కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) వద్ద ఏర్పాటు చేసిన అనంత, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత లేదని డీఈ పక్కీరప్ప శుక్రవారం తెలిపారు. డ్యాంలో నీటి మట్టం పెరుగుతోందన్నారు. 18 రోజుల క్రితం డ్యాంలో 1.8 టీఎంసీల నీరు మాత్రమే ఉండేదన్నారు. కానీ ఇప్పుడు 2.1 టీఎంసీల నీరుందన్నారు. అంతేకాకుండా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రోజూ 550 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. అలాగే జల విద్యుత్ కేంద్రలో విద్యుత్ ఉత్పత్తి కోసం రోజూ విడుదల చేసే 800 క్యూసెక్కుల నీటిని నిలిపేశామన్నారు. దీంతో ఔట్‌ఫ్లో తగ్గిపోయిందన్నారు. వేసవిరీత్యా ఈ మూడు తాగునీటి ప్రాజెక్టులకు 1.5 టీఎంసీల వరకు నీటిని నిల్వ ఉంచుతామన్నారు. -
కొనసాగుతున్న జల విద్యుత్ తయారీ
కూడేరు : మండలంలోని పెన్నఅహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లోని ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గత నెల 24 నుంచి విద్యుత్ తయారీ ప్రారంభించారు. గురువారానికి మొత్తం రూ.10 లక్షల యూనిట్ల విద్యుత్‌ను తయారు చేసినట్లు ఏపీ జెన్కో డీఈ రఫి అహమ్మద్ తెలిపారు. ప్రస్తుతం ఒక టర్బయిన్‌లో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. విద్యుత్ ఉత్పత్తికి డ్యాం నుంచి రోజుకు సుమారు 700 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ తయారైన విద్యుత్‌ను అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్లే లైన్‌కు కలపనున్నట్టు పేర్కొన్నారు. -
ధర్మవరం కుడికాలువకు నీటి సరఫరా బంద్
కూడేరు : మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం) నుంచి ధర్మవరం కుడి కాలువకు శనివారం నీటి సరఫరా బంద్ చేశారు. కుడి కాలువకు గత నెల 1న నీటిని విడుదల చేసిన విషయం విదితమే. డ్యాం డీఈ పక్కీరప్ప మాట్లాడుతూ కుడి కాలువకు నీటిని విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 2.565 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. రోజుకు 500 నుంచి 700 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా అయ్యిందన్నారు. 112 కిలో మీటర్ల దూరం ఉన్న ధర్మవరం కుడికాలువ కింద ఉన్న 49 చెరువులన్నింటికీ తాగునీటి సౌకర్యార్థం సుమారు 30 శాతానికి పైగానే నీటిని నింపినట్లు చెప్పారు. -
ధర్మవరం కుడికాలువకు నీరు విడుదల
కూడేరు : మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం కుడికాలువకు శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఈ నెల 1నే నీటిని విడుదల చేయగా... 5 రోజులు క్రితం ముకుందాపురం, రామచంద్రాపురం, ఆత్మకూరు మండలంలోని యాలేరు ప్రాంతాల వారు తమ ప్రాంతానికి నీటిని తీసుకెళ్ళేందుకు కుడికాలువకు గండ్లు కొట్టారు. గండ్ల మరమ్మత్తుల కోసం 4 రోజులు క్రితం నీటిని అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు పూర్తి కావడంతో మళ్ళీ నీటిని విడుదల చేశారు. ఈ నీరు డ్యాం నుంచి ధర్మవరం వరకు 112 కిలో మీటర్ల వరకు ప్రవహిస్తుంది. -
పీఏబీఆర్ కు జలసిరి
– జీడిపల్లి రిజర్వాయర్ నుంచి 1000 క్యూసెక్కులు – హెచ్చెల్సీ నుంచి 450 క్యూసెక్కెల నీరు డ్యాంకు సరఫరా కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతోంది. డ్యాంలోకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు సుమారు 1000 క్యూసెక్కులకు పైగానే నీరు సరఫరా అవుతోంది. అలాగే తుంగభ్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా రోజుకు సుమారు 450 క్యూసెక్కుల వరకు సరఫరా అవుతోంది. ఆదివారం డ్యాంలో 2.25 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం డీఈ పక్కీరప్ప తెలిపారు. ఏపీ జెన్కో జల విద్యుత్ తయారికి రోజుకు సుమారు 800 క్యూసెక్కుల వరకు నీటిని డ్యాం నుంచి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి అనంతం ఆ నీరు మిడ్పెన్నార్డ్యాంలోకి వదలడం జరుగుతుందని డీఈ పేర్కొన్నారు. -
అంతర్ జిల్లా పేకాట స్థావరంగా పీఏబీఆర్
అనంతపురం సెంట్రల్ : ఉరవకొండ నియోజకవర్గంలోని పీఏబీఆర్ డ్యాం పరిసర ప్రాంతం అంతర్జిల్లా పేకాట స్థావరానికి అడ్డాగా మారుతోంది. ఇక్కడ రోజూ రూ.కోట్లలో పేకాట సాగుతున్నట్లు సమాచారం. నియోజకవర్గ అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడు ఈ పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది కాపలాదారులను నియమించుకొని రహస్యంగా సాగిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు వాటాలు ముట్టజెప్పి వారి నోరు మూయించినట్లు తెలిసింది. -
పీఏబీఆర్‌లోకి తుంగభద్ర జలాలు
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లోకి తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా వస్తున్న నీరు శనివారం చేరింది. సుమారు 860 క్యూసెక్కులు నీరు వస్తున్నట్లు డ్యాం డీఈ పక్కీరప్ప తెలిపారు. తుంగభద్ర జలాల రాకతో డ్యాంలో నీటి మట్టం పెరగనుంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నిల్వ ఉన్న నీటి నుంచి డ్యాంలో ఏర్పాటు చేసిన అనంత తాగునీటి పథకానికి, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 70 క్యూసెక్కుల వరకు నీటిని సర ఫరా చేస్తున్నారు. డ్యాంలో నీటి మట్టం పెరిగితే జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీ ప్రారంభం కానుంది.