
పీఏబీఆర్‌లోకి తుంగభద్ర జలాలు
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లోకి తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా వస్తున్న నీరు శనివారం చేరింది. సుమారు 860 క్యూసెక్కులు నీరు వస్తున్నట్లు డ్యాం డీఈ పక్కీరప్ప తెలిపారు. తుంగభద్ర జలాల రాకతో డ్యాంలో నీటి మట్టం పెరగనుంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఈ నిల్వ ఉన్న నీటి నుంచి డ్యాంలో ఏర్పాటు చేసిన అనంత తాగునీటి పథకానికి, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 70 క్యూసెక్కుల వరకు నీటిని సర ఫరా చేస్తున్నారు. డ్యాంలో నీటి మట్టం పెరిగితే జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీ ప్రారంభం కానుంది.