
పొట్టకూటి కోసం.. చిటారు కొమ్మకు!
చింతచిగురు పప్పు, ఇగురు ఎంత రుచిగా ఉంటాయో అందరికీ తెలిసిందే. చింతాకుతో ఇంకా అనేక రకాల శాకాహార, మాంసాహార వంటలు కూడా తయారు చేస్తారు. ఆరోగ్యానికి ఎంతగానో సహకరించే ఈ చింతచిగురును సేకరించడం కష్టమైన పనే. కానీ నిరుపేదలు పొట్టకూటి కోసం కష్టమైనప్పటికీ చింతాకు సేకరించి, విక్రయించి తద్వారా వచ్చిన సొమ్ముతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. కూడేరు మండలం రామచంద్రాపురం, అరవకూరు, కూడేరుకు చెందిన పలువురు మహిళలు జల్లిపల్లి నుంచి పీఏబీఆర్ డ్యాం వరకు రోడ్డు పక్కన ఉన్న చింత చెట్లలోని చిగురు కోయడానికి పడుతున్న పాట్లు ఇవీ.
- కూడేరు (ఉరవకొండ)