– 12 మంది పందెం రాయుళ్ల అరెస్టు
హిందూపురం రూరల్ : మండలంలోని చెర్లోపల్లి గ్రామం సమీపం అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరాలపై దాడులు చేసి 12 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేసినట్టు రూరల్ సీఐ రాజగోపాల్‌నాయకుడు తెలిపారు. శనివారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
పెనుకొండ, సోమందేపల్లి, హిందూపురం, గుట్టూరు చెందిన పందెంరాయుళ్లు చెర్లోపల్లి వద్ద కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ఆంజినేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారన్నారు. దాడుల్లో బోయ రాజప్ప, అక్కులప్ప, నగేష్, మురళికష్ణ, అశ్వర్థప్ప, నరసింహులు, సురేష్, ప్రసాద్‌బాబు, శివ, అశ్వర్థప్ప, ఆదినారాయణ, రామాంజి, 5 ద్విచక్రవాహనాలు, నాలుగు పందెం కోళ్లు, రూ.31,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు చెప్పారు. మరో 8 మంది పందెం రాయుళ్లు పారిపోయారని వారి ఆచూకీSకోసం గాలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంక్రటామిరెడ్డి, రామాంజి, ఆంజినేయులు, మల్లి, శివ, శీన, రవి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
కోడి పందేల స్థావరాలపై దాడులు
Published Sat, Sep 24 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
Advertisement
Advertisement