ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో 21 మంది జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బెజ్జూరు: ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో 21 మంది జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో మండలంలోని లోడుపల్లి గ్రామంలో ఓ ఇంటిపై శుక్రవారం అర్ధరాత్రి దాడులు చేశారు. ఈ సందర్భంగా 21 మంది పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.