- గుడివాడలో తెలుగు తమ్ముళ్ల నిర్వాకం
- ప్రచారానికి తిప్పుకుని, ఓటు వేయడానికి కూడా సొమ్ము ఇస్తామని ప్రలోభం
- పోలింగ్ రోజు మాయం
- టీడీపీ ఆఫీసు వద్ద పలువురి రాస్తారోకో
గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : ‘మేము ఓటుకు రూ.1200 ఇస్తాం.. మీరు కొడాలి నానికి ఓటువేయవద్దు..అని టీడీపీ నాయకులు వచ్చి చె ప్పారు.. రాత్రంతా వీరికోసం ఎదురు చూశాం.. తీరా డబ్బు ఇవ్వకుండా, ఆఫీసులో లేకుండా వెళ్లిపోయారు.. మా గతి ఏమిటి?.. డబ్బు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలం...’ అని పట్టణానికి చెందిన సుమారు వెయ్యి మంది ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
ఈ సం దర్భంగా గుడివాడ-హనుమాన్‌జంక్షన్ రహదారిపై గంటకు పైగా రాస్తారోకో చేశారు. అక్కడే ఉన్న టీడీపీ నేతలతో వా గ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వచ్చి వారిని చెల్లా చె దురు చేసి పార్టీ కార్యాలయం గేట్లు మూసివేశారు. బుధవా రం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తమ పార్టీకి ప్రచారానికి వచ్చేవారితోపాటు ఓటు వేసే వారికి డబ్బు ఇస్తామంటూ పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు వివిధ వార్డుల్లోని ప్రజలను మభ్యపెట్టారు. వైఎస్సార్ సీపీ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీ వెం కటేశ్వరరావు(నాని)కి ఓటు వేయొద్దని కూడా వారికి హు కుం జారీ చేశారు. పలు వార్డుల్లో కొంతమందికి సొమ్ము ఇ చ్చారు. మరికొంత మందికి ఇవ్వలేదు. ప్రచారంలో పాల్గొని సొమ్ము అందని పలువురు స్థానికులు టీడీపీ నేతలను నిల దీసేందుకు వందల సంఖ్యలో బుధవారం పార్టీ కార్యాల యానికి వచ్చి ముట్టడించారు.
డబ్బు ఇచ్చే వరకు ఇక్కడ నుం చి కదిలేది లేదంటూ ఆందోళన చేశారు. ఆ సమయం లో పార్టీ కార్యాలయంలో ఉన్న పర్వతనేని బుడ్డీబాబును ‘మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరూ?’ అంటూ ప్రశ్నించారు. తనకేమీ తెలియదని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అతడు బదులివ్వడంతో వారు తీవ్ర ఆగ్రహం చెందారు. పార్టీ కార్యాలయం ఎదుట ఏలూరు రోడ్డుపై ధర్నా ప్రారంభించారు. ‘టీడీపీ డౌన్ డౌన్.. రావి వెంకటేశ్వరరావు డౌన్..డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
గంటన్నరపాటు వీరి ఆందోళన కొనసాగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక 30వ వార్డుకు చెందిన నాగమణి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రచారం అన్ని రోజులూ తమను వెంటబెట్టుకుని తెలుగుదే శం పార్టీ నేతలు తిరిగారన్నారు. డబ్బు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. డబ్బు ఇచ్చినట్లు వారి వద్ద ఉన్న లిస్టులో టిక్ పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసం ఉదయం నుంచి రాత్రి వరకు వారి వెంట తిప్పుకుని రూ పాయి ఇవ్వకుండా మమ్మల్ని బాధపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
రావి వెంకటేశ్వరరావు నిలబడిన ప్రతిసారీ ఇలానే చేస్తున్నాడని ఆవేదన చెందారు. మూడో వార్డుకు చెందిన మరో మహిళ కుమారి మాట్లాడుతూ మంగళవారం రాత్రి నుంచి మాకు డబ్బు ఇస్తాం అంటూ చెప్పి ఇవ్వలేదన్నారు. ‘మీ అమ్మాబాబులు సంపాదించిన సొమ్ము ఏమైనా ఉందా?’ అంటూ మా మనసుల్ని గాయపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి తోడు మమ్మల్ని కొడాలి నానికి ఓటు వేయొద్దంటూ భయపెట్టారని ఆరోపించారు. డబ్బు ఇవ్వకపోగా, మేము ఓటు వేయకముందే మా ఇళ్ల వద్దకు వచ్చి ‘మీరు వైఎస్సార్ సీపీకి ఓటు ఎందుకు వేశారు?’ అం టూ దాడికి యత్నించారని ఆ రోపించారు. అందుకే బాధ కలిగి వారిని నిలదీసేందుకు ఇక్కడకు వచ్చామన్నారు.
పత్తా లేని నాయకులు..
పట్టణంలోని పలు వార్డుల్లోని స్థానికులు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు తదితర నాయకులకు తెలిసింది. ఆయా వార్డుల నుంచి పలువురు పార్టీ కార్యాలయానికి వచ్చేసరికి నాయకులు కనిపించలేదు. దీం తో అక్కడకు వచ్చినవారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మే ము వస్తున్నాం.. అనే విషయం తెలియగానే పారిపోతారా.. సిగ్గు లేదూ..’ అంటూ నానా దుర్భాషలాడారు.
ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
ఆందోళనకారుల రాస్తారోకోతో గంటన్నరపాటు ఉద్రిక్తత నెలకొంది. దీనిపై పార్టీ కార్యాలయం నుంచి పోలీసులకు ఫి ర్యాదు అందింది. దీంతో ఇన్‌చార్జి డీఎస్పీ సీతారామస్వామి, వన్‌టౌన్ సీఐ వై.వి.రమణ సిబ్బందితో టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. ‘పార్టీ కార్యాలయం వరకు ప్రజలను తెచ్చుకోవడం ఏంటి?’ అం టూ పార్టీ నేతలను మందలించారు.