కఠారికి రఘువీరారెడ్డి పరామర్శ
గుడివాడ :
మాజీ ఎమ్మెల్యే కఠారి సత్యనారాయణరావు కుటుంబ సభ్యులను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పరామర్శించారు. గురువారం రాత్రి స్థానిక బంటుమిల్లి రోడ్డులో ఉన్న కఠారి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. కఠారి సత్యనారాయణరావు సతీమణి రత్నబాయమ్మ ఇటీవలే మృతిచెందారు. కఠారి కుటుంబంతో తమకెంతో అనుబంధం ఉందని రఘువీరారెడ్డి చెప్పారు. సత్యనారాయణరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా , మున్సిపల్ చైర్మన్‌గా గెలిచారని, ఆయన కుమారుడు ఈశ్వర్‌కుమార్ తనతోపాటు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారన్నారు. ఈ కుటుంబంతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని తెలిపారు. రత్నబాయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కఠారి కుటుంబ సభ్యులు కఠారి ఈశ్వర్‌కుమార్, కఠారి రామ్‌కుమార్, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, నాయకులు గానుగుల వీరనేతాజీ, రాజేష్, ఉంగరాల హైమావతి, భాగవతుల కోదండపాణి పాల్గొన్నారు.
శిష్టా›్లదత్తాత్రేయులు
కుటుంబానికి పరామర్శ
గుడివాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శిష్టా›్లదత్తాత్రేయులు కు టుంబ సభ్యులను కూడా రఘువీరారెడ్డి పరామర్శించారు. ఇటీవల దత్తాత్రేయు లు తల్లి పద్మావతి మృతిచెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పద్మావతి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
రత్నాబాయమ్మకు ఘన నివాళి
గుడివాడ టౌన్ :
కుటుంబ అభ్యున్నతికి కఠారి రత్నబాయమ్మ ఎంతో పాటుపడ్డారని పలువురు వక్తలు పేర్కొన్నారు.ఆఫీసర్స్ క్లబ్‌లో మాజీ ఎమ్మెల్యే కఠారి సత్యనారాయణరావు సతీమణి రత్నబాయమ్మ సంతాపసభ గురువారం నిర్వహించారు. పలువురు ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మాజీమంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్, ఆయన సోదరులను పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ (బాబ్జీ), మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, లింగం ప్రసాద్, లంకదాసరి ప్రసాదరావు, నుగలాపు వెంకట, సురేష్‌బాబు ఉన్నారు.