గుడివాడ ఎరువుల షాపుల్లో తనిఖీలు
గుడివాడ : గుడివాడలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక బృందం నిర్వహించిన తనిఖీల్లో అధీకృత లైసెన్సులు లేని కంపెనీలకు చెందిన రూ.4 లక్షల 7 వేల 550 విలువైన ఎరువులు, పురుగుమందులను గుర్తించి సీజ్ చేశారు. వ్యవసాయశాఖ డిప్యూటీ డైరక్టర్ ఎన్.నాగాచారి, ఎడిఎ జి.రవిప్రకాష్, ఎఓ బి.సురేష్‌లు బృందం ఈ దాడులు చేసింది. బంటుమిల్లి రోడ్డులోని సాయిశ్రీనివాస ఫెర్టిలైజర్స్‌లో రూ.3.87 లక్షలు, కిన్నెర కాంప్లెక్స్‌లోని గాయత్రి ఫెర్టిలైజర్స్‌లో రూ.20 వేల విలువైన పురుగుమందులు, ఎరువులను సీజ్ చేశారు. ఈ తనిఖీ బృందంతో పాటు గుడివాడ మండల వ్యవసాయాధికారి రంగనాధబాబు పాల్గొన్నారు. అధీకృత లైసెన్సులు లేని కంపెనీల ఎరువులు, పురుగు మందులను విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని అన్నారు.