seez
-
మూడు టన్నుల పశుమాంసం సీజ్
థానె: మహారాష్ట్రలోని పడ్ఘా పోలీసుస్టేషన్ పరిధిలో మూడు టన్నుల పశుమాంసాన్ని పోలీసులు సీజ్ చేశారు. థానె నుంచి ముంబైకి పశుమాంసం లోడుతో వస్తున్న టెంపోను బుధవారం ఆజ్రోలి చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలిపివేసి సోదా చేశారు. టెంపోలోని పాత సామాన్ల అడుగున దాచి పెట్టిన బీఫ్‌ను వెలికి తీసి స్వాధీనం చేసుకున్నారు. దానిని లాబోరేటరీకి పంపి పరీక్షించగా పశుమాంసమేనని తేలింది. ఈ ఘటనలో టెంపో డ్రైవర్, క్లీనర్లను పోలీసులు అరెస్టు చేశారు. -
460 కిలోల ఆల్ఫ్రాజోలం పట్టివేత
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ ల్యాబ్ ముసుగులో ఆల్ఫ్రాజోలం విక్రయిస్తున్న తండ్రీకొడుకులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి మొత్తం 460 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ రూ 4.60 కోట్లు ఉంటుందని అంచనా. ఎక్సైజ్ ఇన్చార్జ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అజయ్‌రావు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పాశంమైలారం ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఒక గోదాంలో నిషేధిత ఆల్ఫ్రాజోలం ఉందనే పక్కా సమాచారం టాస్క్‌ఫోర్స్ అధికారులకు అందింది. గోదాంపై దాడి చేసి 10 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకుని సిద్ధార్థ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కూకట్పల్లి లో మరో గోదాంపై దాడులు చేశారు. అక్కడ ఎనిమిది డబ్బాల్లో నిల్వ చేసిన దాదాపు 450 కిలోల ఆల్ఫ్రాజోలం దొరికింది. పొరుగు రాష్ట్రాల నుంచి దీన్ని దిగుమతి చేసుకొని అక్రమంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. సీఆర్పీ లైఫ్ సెన్సెస్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న సిద్ధార్థరెడ్డి, ఆతని తండ్రి సీపీరెడ్డి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్‌రావు, ట్రేడింగ్ బిజినెస్ ఆడిటర్ సెల్వకుమార్‌పై కేసులు నమోదు చేశారు. -
రూ. 46 లక్షల పాతనోట్లు పట్టివేత ?
రాజానగరం : జాతీయ రహాదారిపై స్థానిక బైపాస్‌లోని పెట్రోలు బంకు వద్ద రూ.46 లక్షలు విలువైన రద్దు చేసిన కరెన్సీని రాజానగరం పోలీసులు పట్టుకున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. పెట్రోలు బంకు వద్ద ఈ నోట్ల మార్పిడి జరుగుతుదంటూ ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు మారువేషాలలో కాపుకాచి పట్టుకున్నట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించి కరెన్సీతోపాటు ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. -
అక్రమాల అడ్డా
కాకినాడ పోర్టులో మితిమీరిన మాఫియా ఆగడాలు అక్రమ మార్గాల్లో తరలిపోతున్న సరకు దండిగా అధికారుల అండదండలు! తాజాగా వెలుగుచూసిన రా షుగర్ వ్యవహారం రోజురోజుకూ కాకినాడ పోర్టులో అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. ఇదంతా పోర్టు అధికారులు, పోలీసు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయిల్ మాఫియా వివిధ రకాల వంటనూనెల్లో కల్తీకి పాల్పడుతుండగా, మరోవైపు పోర్టులోకి వచ్చే వివిధ రకాల వస్తువులు అక్రమ మార్గాల్లో తరలిపోతున్నాయి. అధికారులు మాత్రం తమకు తెలియనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. – కాకినాడ రూరల్ ఏ సరుకు ఎప్పుడు, ఏ ఓడకు వస్తుంది, వెళుతోందనే విషయాలపై అధికారులకు పక్కా సమాచారం ఉంటుంది. సరకునున అక్రమ మార్గాల్లో తరలించేందుకు వీలుగా అధికారులే మాఫియాను ప్రోత్సహిస్తున్నారని సూర్యారావుపేట, వాకల పూడి, హార్బర్‌పేట తదితర ప్రాంతాలకు చెందినవారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గతంలో ఓ ఫ్యాక్టరీలో కల్తీ నూనెను అధికారులు సీజ్ చేశారు. ఆ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. వివిధ ఫ్యాక్టరీలకు చేరాల్సిన యూరియా, డీఏపీ వంటి ఎరువులు సరాసరి బ్లాక్‌మార్కెట్‌కు తరలించేస్తున్నా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అత్యధిక క్వాలిటీతో తయారు చేసి విదేశాలకు సరఫరా చేసే రా షుగర్‌ను కూడా అక్రమార్కులు తరలించేందుకు యత్నిస్తున్నారంటే పోర్టు ఏరియాలో మాఫియా ఆగడాలు ఏ మేరకు సాగుతున్నాయనేది అవగతమవుతోంది. 30 టన్నుల రా షుగర్ స్వాధీనం సోమవారం కాకినాడ వాకలపూడి స్లమ్‌బర్గ్ ప్రాంతంలోను, సామర్లకోట ఉండూరులోని ఓ లేఅవుట్‌లోను అక్రమంగా నిల్వ ఉంచిన 30 టన్నుల రా షుగర్‌ను కస్టమ్స్ అధికారులు దాడి చేసి, స్వాధీనం చేసుకున్నారు. ఈ రా షుగర్‌ను కాకినాడ వాకలపూడిలో ఉన్న ప్యారీ షుగర్ ఫ్యాక్టరీకి తరలించాల్సి ఉందని, కొందరు అక్రమార్కులు ఈ షుగర్‌ను బయట ప్రాంతాలకు తరలించి అక్రమంగా అమ్ముకుంటున్నారని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ రా షుగర్‌ను మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వినియోగించే పరిస్థితులు లేవు. దీనిని విదేశాల్లో కిలో ఒక్కంటికి రూ.450 చొప్పున అమ్ముతారని, దీనికి ఇంత రేటు ఎందుకో తెలియదని, అసలు దీనిని ఎందుకు వినియోగిస్తారో కూడా తెలియదని అధికారులు, స్థానికంగా ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు చెబుతున్నారు. అధికారులు దాడిచేసి పట్టుకున్న షుగర్‌ను రెండు లారీల్లో కాకినాడలోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. అధికారులు ఈ వివరాలను చెప్పేందుకు నిరాకరించారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని, ప్రస్తుతం వివరాలేమీ తాము చెప్పలేమని పేర్కొన్నారు. దీనిని ఓడ నుంచి తరలించారా లేదా ప్యారీ షుగర్ ఫ్యాక్టరీకి వచ్చిన తర్వాత తరలించారా అన్నది తేలాల్సి ఉందంటున్నారు. కాకినాడ పోర్టు తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రా షుగర్‌ను అక్రమార్కులు దేనికి వినియోగిస్తున్నారు, ఎక్కడ వినియోగిస్తున్నారనే విషయాలపై కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న రా షుగర్ విలువ దాదాపు రూ.1.35 కోట్లు ఉంటుం దని అంచనా వేస్తున్నారు. రెండు లారీలను కూడా అధికారులు సీజ్ చేసినట్టు సమాచా రం. కస్టమ్స్ డీసీ వై.భాస్కరరావు ఆధ్వర్యం లో అధికారుల బృందం దాడులు నిర్వహిం చింది. దర్యాప్తు పూర్తయితేనే కానీ సమాచా రం చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు. -
వెండి ఉచ్చు
యువతను పావులుగా వాడుకుంటున్న వైనం ప్రతి గురువారం గుట్టుచప్పుడు కాకుండా రవాణా విద్యార్థుల్లా బ్యాగుల్లో తరలించి, దుకాణాల్లో విక్రయం వాణిజ్య పన్నుల శాఖకు రూ.లక్షల్లో ఆదాయానికి గండి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. వెండి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇందుకోసం అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతూ, యువతను పెడతోవ పట్టిస్తున్నారు. రెండు రోజుల క్రితం అమలాపురం బస్టాండ్ వద్ద 34 కిలోల వెండి వస్తువులను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు యువకులు పట్టుబడగా, ఇలాంటి యువకులెందరో ఈ అక్రమ దందాలో పావులుగా మారుతున్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. – అమలాపురం టౌన్ ప్రతి గురువారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి ఓ బడా వెండి, బంగారు వ్యాపారి కోనసీమలోని అమలాపురం, రాజోలు, మలికిపురం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం, తాటిపాక తదితర ప్రాంతాలకు ఖరీదైన కార్లలో, చురుకైన యువకుల ద్వారా అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఒక్క గురువారం మాత్రమే ఈ రవాణా గుట్టుగా చేస్తారు. గత గురువారం కారులో వచ్చిన ముగ్గురు సభ్యుల ముఠా పి.గన్నవరంలో ఓ దుకాణదారునికి వాటిని విక్రయిస్తుండగా, వారి మధ్య బేరసారాల విషయమై గొడవ జరిగింది. ఆ ముఠా అక్కడ నుంచి కారులో అమలాపురం బయలుదేరింది. పి.గన్నవరం వ్యాపారి ఈ అక్రమ రవాణా సమాచారాన్ని పట్టణ పోలీసులకు ఫోన్లో అందించారు. దీంతో అమలాపురం బస్‌స్టేçÙన్ వద్ద పోలీసులు నిఘా ఉంచి, వారిని పట్టుకోవడంతో ఈ అక్రమ రవాణా గుట్టు రట్టయింది. దుకాణాలకు చేరేదిలా.. నర్సాపురం నుంచి చించినాడ వంతెన మీదుగా ఖరీదైన కార్లలో, విద్యార్థుల్లా ఉండే కొందరుæయువకులతో కారు సీట్లు లోపల ఉండే రహస్య అరల్లో వెండి, బంగారు వస్తువులు దాచి తరలిస్తారు. వారు వెళ్లిన చోట ఇద్దరు యువకులు బ్యాగుల్లో వెండి, బంగారు వస్తువులను పెట్టుకుని, కాలినడకన దుకాణాలకు వెళతారు. అభరణాలను అక్కడికక్కడే అమ్మి, నగదు కూడా తక్షణమే తీసుకుంటారు. ఫోన్లలో మాటలు ముందుగా జరిగిపోవడంతో, పనులన్నీ చకచకా సాగిపోతాయి. కోనసీమలో ఈ అక్రమ రవాణా వల్ల వాణిజ్య పన్నుల శాఖకు పన్ను ఎగవేత ద్వారా రూ.లక్షల్లో ఆదాయానికి గండి పడుతోంది. నిఘా మరింత పెంచుతాం పన్ను చెల్లింపు లేకుండా జరుగుతున్న వెండి వస్తువుల అక్రమ రవాణాపై ఇక నుంచి మరింత నిఘా పెడతాం. ఇప్పటికే అక్రమ రవాణాతో పన్నులు ఎగవేసే వారిపై చెక్ ఆఫ్ వెహికలర్ ట్రాఫిక్ విధానంతో మూడు దశల్లో నిరంతర తనిఖీలు చేస్తున్నాం. మాకు గూడ్స్ వెహికల్స్‌ను ఆపి తనిఖీ చేసే అధికారం మాత్రమే ఉంది. కార్లను ఆపి, తనిఖీ చేసే అధికారం లేదు. కార్లలో వెండి వస్తువులను అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నిఘా పెంచుతాం. – కృష్ణప్రసాద్, డీసీటీఓ(అమలాపురం రూరల్) -
వారం వారం వెండి అక్రమ రవాణా
నరసాపురం టు అమలాపురం ప్రతి గురువారం తరలింపు పట్టుబడ్డ రూ.15 లక్షల విలువైన 34 కిలోల వెండి పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు నగదు, కారు స్వాధీనం అమలాపురం టౌన్ : ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించకుండా వెండి ఆభరణాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. ప్రతి గురువారం ఈ ముఠా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి అమలాపురానికి వెండి వస్తువులను రవాణా చేస్తుంటుంది. ఆ క్రమంలో ఓ ఖరీదైన కారులో ముగ్గురు వ్యక్తులతోపాటు అక్రమంగా రవాణా అవుతున్న 34 కిలోల వెండి వస్తువులను వాహనాల తనిఖీల్లో గురువారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అమలాపురం బస్‌స్టేçÙన్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ అక్రమ రవాణా బండారం బయట పడింది. వారంవారం నరసాపురం నుంచి వెండి అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఇప్పటికే పట్టణ పోలీసులకు సమాచారం ఉంది. దాంతో ఆ కోణంలో గత రెండు గురువారాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే ఈ సారి వారు పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో కారు సీట్లు వెనుక ఉన్న రహస్య అరల్లో 34 కిలోల వెండి వస్తువులు దొరికాయి. వాటిలో వెండిపట్టాలు, లక్ష్మీదేవి విగ్రహాలు, హారతి ప్రమిదలు ఉన్నాయి. మూడు కిలోల వంతున ఈ వస్తువులతో ఉన్న ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.15 లక్షలు ఉంటుందన్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన ఖరీదైన కారు, రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న నరసాపురానికి చెందిన పరిమి రవిశంకర్, కవురు గోపాలకృష్ణ, వేండ్ర రామశంకర్ సిద్ధార్ధలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమలాపురం వాణిజ్య పన్నుల శాఖ డీసీటీవో కృష్ణ ప్రసాద్, ఏసీటీవో రామకృష్ణ పోలీసు స్టేషన్‌కు వచ్చి పోలీసులు స్వాధీనం చేసుకున్న వెండి వస్తువులను పరిశీలించారు. ఇవి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న వెండి వస్తువులుగా నిర్ధారించారు. వెండి వస్తువులపై ఒక శాతం పన్నులు చెల్లించాల్సి ఉందని డీసీటీఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు. తాము అదుపులోకి తీసుకున్న ముగ్గురు యువకులను, స్వాధీనం చేసుకున్న వెండి వస్తువులు, నగదును సీఐ శ్రీనివాస్ వాణిజ్య పన్నుల అధికారులకు అప్పగించారు. నరసాపురానికి చెందిన ఓ బడా వెండి వ్యాపారి చురుకైన యువకులను గుమస్తాలుగా నియమించుకొని ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. -
గుడివాడ ఎరువుల షాపుల్లో తనిఖీలు
గుడివాడ : గుడివాడలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక బృందం నిర్వహించిన తనిఖీల్లో అధీకృత లైసెన్సులు లేని కంపెనీలకు చెందిన రూ.4 లక్షల 7 వేల 550 విలువైన ఎరువులు, పురుగుమందులను గుర్తించి సీజ్ చేశారు. వ్యవసాయశాఖ డిప్యూటీ డైరక్టర్ ఎన్.నాగాచారి, ఎడిఎ జి.రవిప్రకాష్, ఎఓ బి.సురేష్‌లు బృందం ఈ దాడులు చేసింది. బంటుమిల్లి రోడ్డులోని సాయిశ్రీనివాస ఫెర్టిలైజర్స్‌లో రూ.3.87 లక్షలు, కిన్నెర కాంప్లెక్స్‌లోని గాయత్రి ఫెర్టిలైజర్స్‌లో రూ.20 వేల విలువైన పురుగుమందులు, ఎరువులను సీజ్ చేశారు. ఈ తనిఖీ బృందంతో పాటు గుడివాడ మండల వ్యవసాయాధికారి రంగనాధబాబు పాల్గొన్నారు. అధీకృత లైసెన్సులు లేని కంపెనీల ఎరువులు, పురుగు మందులను విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని అన్నారు. -
రూ 1.50 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
పద్నాలుగేళ్లు శిక్ష పడినా గంజాయి వ్యాపారమే ఈ కేసులో ఆరుగురి అరెస్టు పరారీలో ఇద్దరు నిందితులు రాజమహేంద్రవరం క్రైం : గంజాయి వ్యాపారం చేస్తూ పట్టుపడి ... యావజ్జీవ కారాగార శిక్ష పడినా మారని నిందితుడు. బెయిల్‌పై జైలు నుంచి విడుదలై అదే వ్యాపారం చేస్తూ మళ్లీ పోలీసులకు చిక్కిన స్మగ్లర్‌ను రాజమహేంద్రవరం అర్భన్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రూ.1.50 కోట్లు విలువైన గంజాయిని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజ కుమారి తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఈ నెల 24 వ తేదీన కడియం మండలం జేగురుపాడు గ్రామం వద్ద అక్రమంగా గాజాయిని, పుచ్చకాయలు, తవుడు బస్తాల మాటున తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో స్పెషల్ పార్టీ పోలీసులు, ఎజీఎస్ పార్టీ, లోకల్ పోలీసులు, వి.ఆర్.ఓ, ఎం.ఆర్.ఓ ఆద్వర్యంలో దాడి చేసి రెండు ఐషర్ వ్యాన్లు, ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ వాహనాలలో రెండు కేజీల ప్యాకెట్లు చొప్పున 158 పాలిధీన్ ప్యాకెట్లులో 4 టన్నుల గంజాయిని తరలిస్తున్నారన్నారు. ఈ లారీలు విశాఖ జిల్లా కొయ్యూరు గ్రామంలోని చిట్టిబాబు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి అనపర్తి గ్రామానికి చెందిన గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి తన రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు తెలిపారు. రైస్ మిల్లు నుంచి మధ్యవర్తి గుంటూరు జిల్లా నర్సరావు పేట మండలం, రామిరెడ్డి పేట గ్రామానికి చెందిన పాములపర్తి శ్రీనివాసరావు ద్వారా హైదరాబాద్‌లోని చౌహాన్ ఆనే వ్యక్తి వద్దకు తరలిస్తున్నట్లు తెలిపారు. కేసులో నర్సారావుపేటకు చెందిన షేక్ సుభాని, రాజమహేంద్రవరం బొమ్మురు కాలనీకి చెందిన చోడవరపు రాజేష్... మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి, ఐదు వాహనాలు సీజ్ చేసిట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.12,760, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పది సంవత్సరాలకు పైగా గంజాయి వ్యాపారం... ఈ కేసులో ప్రధాన నిందితుడు గొలుగూరి సత్యనారాయణ రెడ్డి 2008 సంవత్సరం నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని, ఇతని పై 2008లో జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడని తెలిపారు. ఈ కేసులో 14 సంవత్సరాలు జైలు శిక్ష పడిందని వివరించారు. ఇతనిపై సొంత బావమర్ధిని కిడ్నాప్ చేసిన కేసులో నిందితుడు అని తెలిపారు. 11 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన సత్యనారాయణ రెడ్డి ఇదే వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడని తెలిపారు. ఇతనిపై రౌడీ షీటు తెరుస్తామన్నారు. హైదరాబాద్‌లో చౌహాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పాడడంతో అప్పటి నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని పేర్కొన్నారు. గత నెల రోజుల్లో నాలుగు కేసులు పట్టుకున్నట్లు తెలిపారు. గోకవరం మండలంలో గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. ఈ కేసులో చౌహాన్, చిట్టిబాబులు పరారీలో ఉన్నారని వారిని అరెస్ట్ చేస్తే ఈ గంజాయి ఎక్కడకు తరలిస్తున్నారనేది తెలుస్తోందన్నారు. గంజాయి పట్టుకోవడంలో సహకరించిన పోలీస్ అధికారులకు సిబ్బందికి రివార్డులు ఇస్తామని తెలిపారు. అడిషినల్ ఎస్పీ ఆర్. గంగాధర్, స్పెషల్ పార్టీ డీఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ నారాయణ రావు, ఎజీఎస్ ఎస్సై వెంకటేశ్వరరావు, ఎం. సురేష్, ఎజీఎస్ పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు. -
హైవేపై గంజాయి హవా
యథేచ్ఛగా జరిగిపోతున్న రవాణా ప్రయాణికుల్లా వ్యవహరిస్తూ, తరలిస్తున్న స్మగ్లర్లు అడపాదడపా పోలీసులకు పట్టుబడుతున్న వైనం జాతీయ రహదారిపై గంజాయి రవాణా యధేచ్ఛగా సాగిపోతోంది. అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి మరీ సరుకును తరలించుకుపోతున్నారు. గత మూడు మాసాల్లో గంజాయి తరలిస్తున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేసి, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. – రాజానగరం గంజాయి రవాణా చేస్తూ, పోలీసులకు పట్టుబడిన కేసులో బొమ్మూరు పోలీసు స్టేషన్ పరిధిలో రెండు, రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. గంజాయిని రవాణా చేసే స్మగ్లర్ల ప్రయాణికుల్లా కార్లలో వెళుతూ, ముందుగా ఒక ఎస్కార్ట్ తరహాలో వారి అనుయాయులను పంపుతారు. ఎక్కడా సోదాలు లేవని వారిచ్చే సమాచారంతో, గంజాయి స్మగ్లర్ల ప్రయాణం ముందుకు సాగుతుంది. జాతీయ రహదారిలో పలుచోట్ల చెక్ పోస్టులున్నప్పటికీ, గంజాయి రవాణా చేసేవారు తెల్లవారుజామున పోలీసులు సైతం కాస్త కునుకు తీసే సమయంలోనో, ఇతర అవసరాలు తీర్చుకునే సమయంలోనో ఆ ప్రాంతాన్ని దాటేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి. కొంతకాలంగా రాష్ట్ర సరిహద్దును కూడా గంజాయి దాటిపోతున్నట్టు తెలుస్తోంది. స్మగ్లర్లు రైళ్లలో కూడా గంజాయిని రవాణా చేస్తున్నారు. అడపాదడపా పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. మెట్టలోనే డంపిగ్ యార్డు ఏజెన్నీ ప్రాంతాల నుంచి జిల్లాలోని మెట్ట ప్రాంతానికి గంజాయిని తరలించి, స్థానికంగా ఓSరహస్య ప్రాంతాన్ని డంపిగ్ యార్డుగా ఉపయోగించుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అందిన సమాచారంపై ఆరా తీస్తూ, ఆ ప్రాంతాన్ని, స్మగ్లర్లను పట్టుకునే పనిలో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి గంజాయిని ప్యాకెట్లుగా తయారుచేసి, రహస్యంగా రవాణా చేస్తున్నారనే అనుమానాన్ని రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు వ్యక్తం చేశారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా నిందితులు వినియోగించుకుంటున్నారు. రూ.10 లక్షల విలువైన గంజాయి పట్టివేత ఏలేశ్వరం : జాతీయ రహదారిపై యర్రవరం వద్ద మంగళవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో సుమారు రూ.10 లక్షల విలువైన గంజాయి లభ్యమైంది. దీంతో పాటు రూ.44 వేల నగదును స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రత్తిపాడు ఇన్చార్జ్ సీఐ బి.అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా జీకేవీధి మండలం పెదవలస గ్రామం నుంచి సుమారు రూ.10 లక్షలు విలువైన 634 కిలోల గంజాయిని వ్యా¯Œæలో జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి, అన్నవరంల్లో దింపేందుకు నిందితులు బయలుదేరారు. యర్రవరం వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సీఐ అప్పారావుతో పాటు సిబ్బందికి బైక్‌పై అనుమానాస్పదంగా తచ్చాడుతున్న విశాఖపట్నానికి చెందిన కె.దేవుడు, ఎల్.కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేయగా, వెనుక వస్తున్న వ్యా¯Œæలో గంజాయి ఉన్నట్టు తెలిసింది. దీంతో వ్యా¯Œæలో ఉన్న గంజాయితో పాటు వ్యాన్ యజమాని, డ్రైవర్ ఎం.విజయసాయి, క్లీనర్ కె.దేవుడు, అదనపు డ్రైవర్ నరిసే అప్పారావును అరెస్టు చేశారు. విశాఖ జిల్లా కేడీపేటకు చెందిన సూరిబాబు తమకు గంజాయి అప్పగించాడని వారు తెలిపారు. ఎస్సై వై.రవికుమార్, ఏఎస్సై నాగేశ్వరరావు పాల్గొన్నారు. 316 కిలోల గంజాయి పట్టివేత రాజానగరం : హైవేపై రవాణా చేస్తున్న 316 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ కె.రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ దీని విలువ రూ.15.8 లక్షలు ఉంటుందని చెప్పారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి సూచనల మేరకు సోమవారం జాతీయ రహదారిపై గైట్ కళాశాల వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ వ్యాన్‌లో గంజాయి పట్టుబడింది. అనకాపల్లి అటవీ ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా గంజాయిని కొని, వ్యాన్‌లో తమిళనాడుకు తరలిస్తున్నారు. వ్యాన్ వెనుక క్యాబిన్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలో దాచిన 18 మూటల్లో ఉన్న గంజాయి లభ్యమైంది. దీనిని తరలిస్తున్న కర్ణాటకలోని కోలార్ జిల్లా రామంత్నగర్కు చెందిన షేక్ సలీమ్, తమిళనాడులోని తానె జిల్లా ఉత్తమపలయం తాలూకా చిన్నమనూర్కి చెందిన తంగవేలు రాము, మణి నివాస్‌ను అరెస్టు చే శారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.37,635 నగదును కూడా స్వాధీనపర్చుకున్నారు.