రూ 1.50 కోట్ల విలువైన గంజాయి పట్టివేత | Rs.1.50 CRORES GANJAI SEEZ | Sakshi
Sakshi News home page

రూ 1.50 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

Published Tue, Jul 26 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

రూ 1.50 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

రూ 1.50 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

  • పద్నాలుగేళ్లు శిక్ష పడినా గంజాయి వ్యాపారమే
  • ఈ కేసులో ఆరుగురి అరెస్టు
  • పరారీలో ఇద్దరు నిందితులు
  •  
    రాజమహేంద్రవరం క్రైం : గంజాయి వ్యాపారం చేస్తూ పట్టుపడి ... యావజ్జీవ కారాగార శిక్ష పడినా మారని నిందితుడు. బెయిల్‌పై జైలు నుంచి విడుదలై అదే వ్యాపారం చేస్తూ మళ్లీ పోలీసులకు చిక్కిన స్మగ్లర్‌ను రాజమహేంద్రవరం అర్భన్‌ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రూ.1.50 కోట్లు విలువైన గంజాయిని రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అర్బన్‌ జిల్లా ఎస్పీ బి. రాజ కుమారి తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఈ నెల 24 వ తేదీన కడియం మండలం జేగురుపాడు గ్రామం వద్ద అక్రమంగా గాజాయిని, పుచ్చకాయలు, తవుడు బస్తాల మాటున తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో స్పెషల్‌ పార్టీ పోలీసులు, ఎజీఎస్‌ పార్టీ, లోకల్‌ పోలీసులు, వి.ఆర్‌.ఓ, ఎం.ఆర్‌.ఓ ఆద్వర్యంలో దాడి చేసి  రెండు ఐషర్‌ వ్యాన్‌లు, ఒక లారీ, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

    ఈ వాహనాలలో రెండు కేజీల ప్యాకెట్లు చొప్పున 158 పాలిధీన్‌ ప్యాకెట్లులో 4 టన్నుల గంజాయిని తరలిస్తున్నారన్నారు. ఈ  లారీలు విశాఖ జిల్లా కొయ్యూరు గ్రామంలోని చిట్టిబాబు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి అనపర్తి గ్రామానికి చెందిన గొలుగూరి వెంకట  సత్యనారాయణ రెడ్డి తన రైస్‌ మిల్లుకు తరలిస్తున్నట్లు తెలిపారు. రైస్‌ మిల్లు నుంచి మధ్యవర్తి గుంటూరు జిల్లా నర్సరావు పేట మండలం, రామిరెడ్డి పేట గ్రామానికి చెందిన పాములపర్తి శ్రీనివాసరావు ద్వారా హైదరాబాద్‌లోని చౌహాన్‌ ఆనే వ్యక్తి వద్దకు తరలిస్తున్నట్లు తెలిపారు. కేసులో నర్సారావుపేటకు చెందిన షేక్‌ సుభాని, రాజమహేంద్రవరం బొమ్మురు కాలనీకి చెందిన  చోడవరపు రాజేష్‌... మొత్తం ఆరుగురిని అరెస్ట్‌ చేసి,  ఐదు వాహనాలు సీజ్‌ చేసిట్లు తెలిపారు.  వీరి వద్ద నుంచి రూ.12,760, 9 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 
     
    పది సంవత్సరాలకు పైగా గంజాయి వ్యాపారం...
    ఈ కేసులో ప్రధాన నిందితుడు గొలుగూరి సత్యనారాయణ రెడ్డి 2008 సంవత్సరం నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని, ఇతని పై 2008లో జగ్గంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడని తెలిపారు. ఈ కేసులో 14 సంవత్సరాలు జైలు శిక్ష పడిందని వివరించారు. ఇతనిపై సొంత బావమర్ధిని కిడ్నాప్‌ చేసిన కేసులో నిందితుడు అని తెలిపారు. 11 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన సత్యనారాయణ రెడ్డి ఇదే వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడని తెలిపారు. ఇతనిపై రౌడీ షీటు తెరుస్తామన్నారు.

    హైదరాబాద్‌లో చౌహాన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పాడడంతో అప్పటి నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నాడని పేర్కొన్నారు. గత నెల రోజుల్లో నాలుగు కేసులు పట్టుకున్నట్లు తెలిపారు. గోకవరం మండలంలో గంజాయి స్మగ్లింగ్‌ చేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. ఈ కేసులో చౌహాన్, చిట్టిబాబులు పరారీలో ఉన్నారని వారిని అరెస్ట్‌ చేస్తే ఈ గంజాయి ఎక్కడకు తరలిస్తున్నారనేది తెలుస్తోందన్నారు. గంజాయి పట్టుకోవడంలో సహకరించిన పోలీస్‌ అధికారులకు సిబ్బందికి రివార్డులు ఇస్తామని తెలిపారు. అడిషినల్‌ ఎస్పీ ఆర్‌. గంగాధర్, స్పెషల్‌ పార్టీ డీఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ నారాయణ రావు,  ఎజీఎస్‌ ఎస్సై వెంకటేశ్వరరావు,  ఎం. సురేష్, ఎజీఎస్‌ పోలీస్‌ సిబ్బంది, పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement