
థానె: మహారాష్ట్రలోని పడ్ఘా పోలీసుస్టేషన్ పరిధిలో మూడు టన్నుల పశుమాంసాన్ని పోలీసులు సీజ్ చేశారు. థానె నుంచి ముంబైకి పశుమాంసం లోడుతో వస్తున్న టెంపోను బుధవారం ఆజ్రోలి చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలిపివేసి సోదా చేశారు. టెంపోలోని పాత సామాన్ల అడుగున దాచి పెట్టిన బీఫ్‌ను వెలికి తీసి స్వాధీనం చేసుకున్నారు. దానిని లాబోరేటరీకి పంపి పరీక్షించగా పశుమాంసమేనని తేలింది. ఈ ఘటనలో టెంపో డ్రైవర్, క్లీనర్లను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment