జనం నెత్తినగ్యాస్‌‘బండ’ | Delivery charged with the illegal | Sakshi
Sakshi News home page

జనం నెత్తినగ్యాస్‌‘బండ’

Published Sat, Feb 8 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

జనం నెత్తినగ్యాస్‌‘బండ’

జనం నెత్తినగ్యాస్‌‘బండ’

  • డెలివరీ పేరుతో అక్రమ వసూలు
  •  మొక్కుబడి జీతాలతో అక్రమాలకు ఆజ్యం పోస్తున్న కంపెనీలు
  •  లబోదిబోమంటున్న వినియోగదారులు
  •  నెలకు సగటున రూ.12 లక్షలు మింగేస్తున్న తీరు
  •  గుడివాడ, న్యూస్‌లైన్ :  గుడివాడ పట్టణంలో నాలుగు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటికి గుడివాడ పట్టణం, గుడివాడ రూరల్ మండలంతో పాటు, పెదపారుపూడి, నందివాడ, ముదినేపల్లి, ఉయ్యూరు మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. వీటి ద్వారా 70 వేల కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు దాదాపు రెండువేల గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుందని అధికారులు అంటున్నారు. గ్యాస్ ధర ప్రస్తుతం రూ.1213 కాగా గుడివాడ పట్టణంలో డెలివరీ చేసినందుకు రూ.20 నుంచి రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం అయితే రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ పేరుతో నెలకు దాదాపు రూ.12 లక్షలకు పైగా వినియోగదారుల నెత్తినఅక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     
    నిబంధనలు ఇవీ..
     
    గ్యాస్ ఏజెన్సీలకు కంపెనీ నుంచి ఒక్కో సిలిండర్‌కు రూ.50 వరకు కమీషన్‌గా వస్తుంది. గ్యాస్ ఏజెన్సీ ఉన్న గుడివాడ పట్టణంలో డెలివరీకి ఎటువంటి చార్జీలూ వసూలు చేయకూడదు. గుడివాడ దాటి ఇతర గ్రామాల్లో సరఫరా చేసినందుకు ఒక్కో సిలిండర్‌కు రూ.10 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. కానీ గుడివాడ పట్టణంలో ప్రస్తుతం గ్యాస్ ధరను బట్టి రూ.20 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో సిలిండర్‌కు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ గ్యాస్ సిలెండర్ సరఫరా చేసే రిక్షా, ఆటో డ్రైవర్ తీసుకుంటాడు.
     
    డెలివరీ బాయిస్‌కు ఇచ్చే జీతం రూ.500లే..

    ఈ విషయమై ‘సాక్షి’ పరిశీలన జరుపగా సిలిండర్ల సరఫరా కోసం గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగులుగా పెట్టుకుంటుంది. వీరికి నిబంధనల ప్రకారం జీతం ఇవ్వాల్సి ఉంది. ఏజెన్సీకి గ్యాస్ కంపెనీ ఇచ్చే కమీషన్‌లోనే వీరికి జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయితే గ్యాస్ సరఫరా చేసే వారికి ఆయా గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చే జీతం చూస్తే ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. ఏలూరు రోడ్డులో ఉన్న ఒక ఏజెన్సీ డెలివరీ బాయిస్‌కు నెలకు రూ.500 ఇస్తుండగా మరో ఏజెన్సీ రూ.700 ఇస్తుంది.

    వీరందరినీ వినియోగ దారుల వద్ద అక్రమ వసూళ్లుచేసి బతకమని చెప్పేందుకు ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటికే గ్యాస్ ధరలు భరించలేని వినియోగ దారులు ఈ అక్రమ వసూళ్లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై గుడివాడ పౌర సరఫరాల డిప్యూటీ తహశీల్దార్ గంధం డేవిడ్‌రాజును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు.
     
     గ్యాస్ డెలివరీ బాయ్ చేయాల్సింది ఇదీ...

     గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు తీసుకొచ్చే డెలివరీ బాయ్ దానితో పాటు కంపెనీ బిల్లును ఇవ్వాల్సి ఉంది.
     
     ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి 12 కిలోమీటర్ల లోపు డెలివరీ ఇచ్చే గ్యాస్ సిలిండర్‌లకు ఎటువంటి సర్వీసు చార్జీ తీసుకోరాదు.
     
     గ్యాస్ సిలిండర్ వినియోగదారుడికి ఇచ్చేముందు దాని బరువు (తూకం) చూపించి ఇవ్వాలి. కానీ గ్యాస్ సిలిండర్లను తూకం వేసేందుకు డెలివరీ బాయిస్ వద్ద బరువు తూచే యంత్రాలు ఉండవు.
     
     గ్యాస్ సిలిండరును వినియోగదారు ఇంట్లో రెగ్యులేటర్‌కు బిగించి పొయ్యి వెలిగించి చూపించాలి. కానీ ఎక్కడా ఇటువంటి సేవలు ఇచ్చిన దాఖలాలు లేవు. అయినప్పటికీ వినియోగదారుల వద్ద డెలివరీ చార్జీల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూలు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement