కృష్ణాజిల్లా గుడివాడ 19వ వార్డు ఉప ఎన్నికలో గెలుపుతో టీడీపీ నేతలు మంగళవారమిక్కడ హంగామా సృష్టించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు బాణాసంచా కాల్చి తెలుగు తమ్ముళ్లు రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు. అంతేకాకుండా కార్యాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. వారి చర్యలను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు
Published Tue, Apr 11 2017 11:33 AM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement