
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి కొడాలి నాని తదితరులు
గుడివాడ టౌన్: కృష్ణాజిల్లా గుడివాడలో గురువారం నిర్వహించనున్న మహాశివరాత్రి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. వేడుకల ఏర్పాట్లను మంగళవారం ఆయన సీఎం కార్యాలయ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఎస్పీ ఎం.రవీంద్రనా«థ్‌బాబుతో కలిసి స్టేడియంలో పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు పరమశివుడి కృపాకటాక్షాలు సిద్ధించాలనే సంకల్పంతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభిషేకం, మహా హోమం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. కాగా, మహాశివరాత్రి పర్వదినాన సూర్యోదయం నుంచి అర్థరాత్రి లింగోద్భవ కాలం వరకు రుద్రపారాయణం, రుద్రహోమం, సహస్రలింగార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శివపార్వతుల కల్యాణ కార్యక్రమాలు జరుగుతాయని నాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment