విశాఖ: విశాఖ జిల్లా రావికమతం మండలం గుడివాడ గ్రామ వీఆర్వో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు పట్టు బడ్డాడు. గుడివాడ గ్రామానికి చెందిన రాజు అనే రైతు హుద్‌హుద్ తుపాను బాధితుడు. దెబ్బతిన్న ఆయన పామాయిల్ తోటకు ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేసింది. అయితే, దానిని పొందాలంటే వీఆర్వో ధ్రువీకరణ అవసరం. అందుకోసం వీఆర్వో ముత్యాలు రూ.50 వేలు డిమాండ్ చేశాడు. దీని పై రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం ఉదయం గుడివాడలోని వీఆర్వో గదిలో బాధిత రైతు డబ్బు అందజేస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వో ని అదుపులోకి విచారిస్తున్నారు.