ఏపీ హైకోర్టులో సివిల్‌ జడ్జి పోస్టులు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు | Andhra Pradesh High Court Recruitment 2021: Civil Judge Posts, Salary, Application Form | Sakshi
Sakshi News home page

ఏపీ హైకోర్టులో సివిల్‌ జడ్జి పోస్టులు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

Published Thu, Aug 5 2021 2:01 PM | Last Updated on Thu, Aug 5 2021 2:05 PM

Andhra Pradesh High Court Recruitment 2021: Civil Judge Posts, Salary, Application Form - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌... సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 22(డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌–18, ట్రాన్స్‌ఫర్‌ పద్ధతి–04)
అర్హత: లాలో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
    
వయసు: 01.07.2021 నాటికి 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.27,700 నుంచి రూ.44,770 వరకు; 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్‌ టెస్ట్‌(కంప్యూటర్‌ బేస్డ్‌), రాతపరీక్ష, వైవా వాయిస్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు మొదట 100 మార్కులకు కంప్యూటర్‌ బేస్డ్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. పరీక్షా సమయం 2 గంటలు. ఈ పరీక్షలో 40 శాతం పైగా మార్కులు సాధించిన అభ్యర్థుల్ని 1:10 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపికచేస్తారు. రాతపరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల అకడమిక్‌ నాలెడ్జ్‌ని పరీక్షిస్తారు. సివిల్‌ లా, క్రిమినల్‌ లా, ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్, ఎస్సే రైటింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం ప్రతి పేపర్‌కు 3 గంటలు. వైవా వాయిస్‌ 50 మార్కులకు నిర్వహిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021

► హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే తేది: 15.09.2021
► స్క్రీనింగ్‌ టెస్ట్‌(కంప్యూటర్‌ బేస్ట్‌) తేది: 03.10.2021
► వెబ్‌సైట్‌: hc.ap.nic.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement