విజేతలకు రూ.9 లక్షల నగదు బహుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 2024–2025 విద్యాసంవత్సరంలో 7,10 తరగతుల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ ఏటా నిర్వహించే ప్రతిభా పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం మంగళగిరిలోని పాఠశాల విద్య రాష్ట్ర కార్యాలయంలో డైరెక్టర్ విజయ రామరాజు వివరాలను విడుదల చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో విజేతలైన వారికి రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.
ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ తవనం వెంకటరావు మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతులు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రెండు దశల్లో జరిగే ఈ పరీక్షలో ప్రిలిమ్స్ డిసెంబర్ 29న, మెయిన్స్ జనవరి 19న నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర అకడమిక్ కేలండర్‌ను అనుసరించి డిసెంబర్ 2024 వరకు గల గణితం, సైన్స్, సోషల్ సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జీకే, ఐక్యూపై 20 శాతం ప్రశ్నలు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వచ్చే నెల 14 వరకు https://educationalepiphany.org/eemt2025/ registrations2025.php లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి సమాచారం కోసం www. educationalepiphany.org లేదా 9573139996/ 9666747996/ 6303293502లో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment