
మధ్యప్రదేశ్ గవర్నర్‌పై ఎఫ్‌ఐఆర్
భోపాల్: ఫారెస్ట్ గార్డుల నియామకాల్లో అక్రమాలకు సంబంధించిన కేసులో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌పై స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీలోని 420తో పాటు పలు సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద దీన్ని నమోదు చేసినట్లు ఎస్టీఫ్ సీనియర్ అధికారి చెప్పారు.
యాదవ్ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఫారెస్ట్ గార్డుల ఉద్యోగాల కోసం మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు అధికారులకు సిఫార్సు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.