SP Naveen Kumar
-
‘దారి’ తీసిన గొడవ
♦ రాళ్ల దాడిలో ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం ♦ వికారాబాద్ జిల్లాలో ఘటన దోమ: దారికి అడ్డంగా బైక్ పెట్టడంతో మొదలైన గొడవ చివరకు ఒకరి ప్రాణాన్ని బలి గొంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం ఐనాపూర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుడ్ల రాజు కొన్నిరోజుల క్రితం తన పొలంలో బోరుబావి తవ్వించాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం స్నేహితులు యాదయ్య, నరేందర్, బుగ్గయ్య, నర్సింలుతో కలసి విందు ఏర్పాటు చేశాడు. రాజు పొలానికి వెళ్లే దారిలోనే గ్రామానికి చెందిన సుజాజొద్దీన్ (50) పొలం ఉంది. గురువారం సాయంత్రం ఆయన కుమారులు సైఫొద్దీన్, అహ్మద్ తమ పొలం దగ్గర దారికి అడ్డంగా బైక్ నిలిపి ఉంచడంతో యాదయ్య వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని యాదయ్య విందులో ఉన్న తన స్నేహితులకు చెప్పడం తో వారు అక్కడికి వచ్చి ఘర్షణకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సుజాజొద్దీన్ రాత్రి మరోవర్గానికి చెందిన వారిని పిలిపించి సర్ది చెప్పాడు. అనంతరం వారిని మరోసారి తిరిగి పిలిపించడంతో గొడవ మొదలైంది. దీంతో సుజాజొద్దీన్, అహ్మద్, సైఫొద్దీన్లపై రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి సుజాజొద్దీన్ మృతి చెందగా.. సైఫొద్దీన్ పరిస్థితి విషమం గా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. వివరాలు సేకరించిన ఎస్పీ ఎస్పీ నవీన్‌కుమార్ శుక్రవారం ఘటన స్థలా నికి చేరుకొని గొడవకు దారి తీసిన కార ణాలను పరిగి డీఎస్పీ అశ్ఫక్, సీఐ ప్రసాద్, ఎస్ఐ ఖలీల్‌ను అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మట్కానివారణకు స్పెషల్ టాస్క్ ఫోర్స్
యువ కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఎస్పీ నవీన్‌కుమార్ తాండూరు రూరల్ : జిల్లాలో మట్కా నివారణకు యువ కానిస్టేబుళ్లతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ భట్టు నవీన్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆత్మహత్యల నివారణకు పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాలతో పాటు సైకాలజిస్టులతో ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని ఠాణాలను సందర్శించి నేరాలకు సంబంధించి నివేదికల ను తయారు చేస్తున్నామని, క్రైం రేటును ఏవిధంగా తగ్గించాలనే విషయమై కార్యాచరణ చేపడతామన్నారు. రోడ్డు ప్రమాదాల విషయమై వాట్సాప్ ద్వారా సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఎస్పీ కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఎస్పీ నవీన్‌కుమార్ పట్టణంలోని పోలీస్‌స్టేషన్ కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చందనదీప్తి, రూరల్ సీఐ సైదిరెడ్డి, పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐలు రేణుకారెడ్డి,చంద్రకాంత్, నాగార్జున ఉన్నారు. ఇసుక రవాణాలో కఠినంగా ఉండండి యాలాల : ఇసుక అక్రమ రవాణా విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ నవీన్‌కుమార్ అన్నా రు. గురువారం యాలాల పోలీస్‌స్టేష న్ను ఆయన సందర్శించారు. ముందు గా పీఎస్‌లోని రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించి పీఎస్‌కు ఎటువంటి కేసులు వస్తున్నాయి? బాధితుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు? అన్న విషయాన్ని ఎస్ఐ అరుణ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ రమేష్ వివరాలను ఎస్పీ నవీన్‌కుమార్ ఏఎస్పీ చందనదీప్తిని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ - 2 మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. సీసీ కెమెరాలతో సరిహద్దు నిఘా బషీరాబాద్ : సీసీ కెమెరాలతో సరిహ ద్దు గ్రామాల్లో నిఘా ఏర్పాటు చేస్తామ ని ఎస్పీ నవీన్ కుమార్ అన్నారు. గురువారం బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఏఎస్పీ చందనదీప్తితో కలిసి సందర్శించారు. స్టేషన్‌లోని పోలీసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.70 లక్షలతో నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలను అదుపులోకి తీసుకువచ్చేందు కు త్వరలో కర్ణాటక పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సరిహద్దు గ్రామాల్లో సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీతో పాటు సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ అభినవ చతుర్వేది తదితరులున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మొక్కలు నాటారు. -
‘ఎవర్ని ఉపేక్షించేది లేదు’
యాలాల : అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ నవీన్‌కుమార్ ఆదేశించారు. గురువారం రంగారెడ్డి జిల్లా యాలాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ స్టేషన్‌లోని సౌకర్యాలపై ఆరా తీసి.. ఫిర్యాదు దారులతో పోలీసుల వ్యవహార శైలి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండలం నుంచి ఇసుక రవాణ యదేచ్ఛగా సాగుతోందని.. దాని వెనుక ఎవరు ఉన్న కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.