అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ నవీన్‌కుమార్ ఆదేశించారు.
యాలాల : అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ నవీన్‌కుమార్ ఆదేశించారు. గురువారం రంగారెడ్డి జిల్లా యాలాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ స్టేషన్‌లోని సౌకర్యాలపై ఆరా తీసి.. ఫిర్యాదు దారులతో పోలీసుల వ్యవహార శైలి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండలం నుంచి ఇసుక రవాణ యదేచ్ఛగా సాగుతోందని.. దాని వెనుక ఎవరు ఉన్న కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.