మట్కారాయుళ్లపై రౌడీషీట్ తెరుస్తాం
మట్కారాయుళ్లపై రౌడీషీట్ తెరుస్తాం
Published Tue, Feb 14 2017 11:45 PM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM
- డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు హెచ్చరిక
- ఇద్దరు నిర్వాహకులతోపాటు 13 మంది అరెస్ట్
- రూ.30 వేల నగదు, చీటీలు స్వాధీనం
ఆదోని టౌన్: మట్కారాయుళ్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు అన్నారు. మితిమీరితే రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఈ నెల 5వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో 3 క్లోజులు, 6 ఓపన్లు అన్న శీర్షికన ప్రచురితమైన వార్తకు స్పందించిన డీఎస్పీ దాడులకు ఆదేశించారు. టూటౌన్ సీఐ గంటా సుబ్బారావు, ఎస్‌ఐలు రంగ,రమేష్ బాబు మంగళవారం సిబ్బందితో దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. మట్కారిగేరికి చెందిన షబీర్ బాషా, కృష్ణ నిర్వహిస్తుండగా వివిధ గ్రామాలకు చెందిన 13 మంది మట్కా రాస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30,610 నగదు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పర్చారు. మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులకు డీఎస్పీ చేతుల మీదుగా నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో సీఐలు గంటా సుబ్బారావు, రామానాయుడు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement