rowdysheet
-
రౌడీఛీటర్ చింతమనేని
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీరు దళితులు, మీరు వెనుకబడిన వారు, మీరు షెడ్యూల్డ్ కాస్ట్ వారు... రాజకీయాలు మాకుంటాయి..మాకు పదవులు... మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా గొడవలు...’’ ఇదీ ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలోని దళిత పేటలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళిత సామాజికవర్గంపై తీవ్ర అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు. ‘‘పవన్‌కళ్యాణ్.. వాడి వల్ల ఏం అవుతుంది. వాడి అన్న చిరంజీవి లాంటి వాడినే గెలిపించుకోలేనివాడు.. మమ్మల్ని ఏమి చేస్తాడు... మేము గతంలో 2014లో వాడి బొమ్మపై గెలిచామా..’’ అంటూ దురహంకారపూరిత వ్యాఖ్యలు. దెందులూరులోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద జనసేన నేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలివి. దెందులూరు టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని నోటి దురుసుతో పాటు తీవ్ర వివాదాస్పద వైఖరితో ప్రతి ఒక్కరిపై దాడులు చేయడంలో సిద్ధహస్తుడు. జర్నలిస్టు మొదలుకొని మంత్రి వరకు అందరిపై దాడి చేసిన ఏకైక రికార్డు కలిగిన రాజకీయ నేత. 85కి పైగా కేసులు చింతమనేనిపై ఉన్నాయని గత డీజీపీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 40కి పైగా క్రిమినల్ కేసులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న చింతమనేనిపై ఏలూరు త్రీటౌన్‌లో రౌడీషిట్ తెరిచారు. అత్యంత వివాదాస్పద వ్యక్తిగా రాష్ట్రంలో గుర్తింపు ఉన్న చింతమనేని అన్ని వర్గాలను దూషించి, అందరితో ఘర్షణలకు దిగినా కనీసం క్షమాపణలు కూడా చెప్పని తలపొగరు రాజకీయం సాగిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొల్లేరు అక్రమ చేపల సాగు, పోలవరం కుడికాల్వ, తమ్మిలేరు ఇసుకను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని వందల కోట్ల సహజ సంపద బహిరంగంగా దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి యతి్నంచిన పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ, మైనింగ్ శాఖ సిబ్బందిపై దాడులుకు దిగిన ఘటనలు కోకొల్లలున్నాయి. 10 ఏళ్ళ ఎమ్మెల్యే పదవి కాలంలో వందల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. పోలవరం గట్లు మాయం పోలవరం కుడికాల్వ గట్టు 20 కిలోమీటర్ల మేర ఐదేళ్లలో పూర్తిగా మాయం చేసిన ట్రాక్ చింతమనేనిది. పోలవరం నుంచి 180 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం ఉండగా దెందులూరు నియోజకవర్గం చల్లచింతలపూడి నుంచి పెదపాడు మండలం వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర ఉంది. 240 అడుగుల వెడల్పుతో కాల్వను నిరి్మంచడానికి భూసేకరణ చేసి 240 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో 80 అడుగుల మేర కాల్వ తగ్గి, కుడి, ఎడమ వైపు 80 అడుగుల మేర పోలవరం గట్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 అడుగుల లోతుతో కాల్వను తవ్వారు. కాల్వను తత్విన మట్టితో పాటు కుడి, ఎడమ వైపు తత్విన గట్లపై ఉన్న గ్రావెల్‌నూ కొల్లగొట్టారు. దెందులూరు నియోజకవర్గంలోనే లక్ష క్యూబిక్ మీటర్ల మేర మట్టిని కొల్లగొట్టినట్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అప్పటి విజిలెన్స్, ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. 17 క్యూబిక్ మీటర్ల చొప్పున ఒక లారీ లోడు దింపి ప్రతిరోజూ 200 టిప్పర్లు, కొన్నేళ్ళపాటు నిరాటంకంగా నిర్వహించి మట్టి దోపిడీకి పాల్పడ్డారు. 85కుపైగా కేసులు అన్ని రకాల కేసులు 85కు పైగానే చింతమనేనిపై ఉన్నాయి. వీటిలో సగం కేసులు కోర్టుల్లో కొట్టి వేయగా, మరికొన్ని నడుస్తున్నాయి. 26 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో ట్రాఫిక్ వి«ధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్ఐ, సీపీఓలపై దాడిచేసిన కేసుతోపాటు తెలంగాణలోనూ కోడిపందేల కేసులు ప్రభాకర్‌పై నమోదు కావడం విశేషం. ప్రధానంగా తహసీల్దార్ వనజాక్షిపై దాడి కేసులో చింతమనేని, ఆయన గన్‌మెన్, మరో 58 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 353, 332, 379, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. 2011 నవంబర్ 26న దెందులూరులో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని దాడి చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్ 506, 353, 332, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. భీమడోలు కోర్టులో రెండేళ్లు జైలుశిక్ష విధించారు. దీనిపై ప్రస్తుతం ఏలూరు జిల్లా కోర్టులో అప్పీల్ కేసు కొనసాగుతోంది. మాజీ మంత్రి వట్టి వసంత్‌పై దాడి 2011 నవంబర్ 26న దెందులూరు ఉన్నత పాఠశాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అప్పటి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్ కుమార్‌పై అప్పటి ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. వట్టి వసంత్‌కుమార్‌తో మాటామాటా పెరిగి చింతమనేని అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదై భీమడోలు జూనియర్ సివిల్ కోర్టులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు నిర్ధారణ కావడంతో జడ్జి కె.దీపదైవకృప రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై చింతమనేని అప్పీల్‌కు వెళ్లారు. తమ్మిలేరును మింగేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ఏలూరు నగరం నుంచి కొల్లేరు వరకు విస్తరించి ఉన్న తమ్మిలేరు ప్రధాన కాల్వను చింతమనేని అండ్ ముఠా మింగేసింది. దెందులూరు నియోజకవర్గంలో తమ్మిలేరు ఎక్కువగా ఉండటం, తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో నాణ్యత ఉన్న ఇసుక ఉండటంతో దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని తమ్మిలేరు పరీవాహక ప్రాంతాలంతా గట్టిగా కొల్లగొట్టారు. ప్రధానంగా పెదవేగి మండలంలో విజయరాయి నుండి ప్రారంభమై నడిపల్లి, బలివే, సూర్యారావుపేట, తమ్మిలేరు, చింతలపూడి నియోజకవర్గం వలసపల్లి వద్ద తమ్మిలేరు 24 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఒక రాత్రికి 200 లారీలు చొప్పున దాదాపు 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను దోచేశారు. దోపిడీ ప్రస్థానాన్ని దెందులూరుతో పాటు పక్క నియోజకవర్గమైన నూజివీడులో కూడా చొరబడి ముసునూరు మండలంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే 2015 జూన్‌లో ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందువయ్యారు. తహసీల్దార్ వనజాక్షి జుట్టు పట్టుకుని దాడి 2015 జూలై 11న ముసునూరులో చింతమనేని అనుచరులు అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో అప్పటి ముసునూరు తహసీల్దార్ వనజాక్షి ఇసుక ట్రాక్టర్లకు అడ్డుపడి గట్టిగా నిలువరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న చింతమనేని హుటాహుటిన అక్కడకు చేరి మహిళా అధికారి, మండల మేజిస్ట్రేట్ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చి పక్కకు పడేసి దాడి చేయడంతో పాటు నానా దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదైన వెంటనే బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం, రెవెన్యూ తిరుగుబాటుతో చంద్రబాబు దిగి వచ్చి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారు. చింతమనేనిపై 2015లో ఏలూరు త్రిటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరిచారు. అలాగే ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖాధికారిపై దాడి, ఐసీడీఎస్‌లో పనిచేసే మహిళా అధికారులపై బెదిరింపులకు దిగడం, 2016 ఫిబ్రవరి 10న కానిస్టేబుల్ మధుపై దాడి ఘటనలకు చింతమనేని పాల్పడ్డారు. కొల్లేరులో చేపలు మాయం కొల్లేరులో చేపలను మాయం చేసిన ఘనత చింతమనేనిది. అటవీ శాఖ అధికారులను బెదిరించి మరీ కొల్లేరులో ఆక్రమణలకు దిగి చెరువులను స్థానిక టీడీపీ నేతలతో సాగు చేయించారు. అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు.. కొన్ని సమయాల్లో చెక్‌పోస్టుల వద్ద పోలీసులపై తన నోటికి, చేతికి పని చెప్పడంతో కేసులు నమోదైన ఘటనలు అనేకం. మొత్తం 1,860 ఎకరాల్లో చేపల చెరువులు పూర్తిగా చింతమనేని కనుసన్నల్లోనే సాగైనట్టు అంచనా. ఒక్క కొల్లేరులోనే సగటున రూ.వంద కోట్లకుపైగా దోచినట్లు సమాచారం. పెదవేగి మండలం పెదవేగి (సూర్యారావుపేట) లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేయకుండా దాదాపు 70 ఎకరాల్లో గ్రావెల్ దోచేశారు. పెదపాడు మండలం ఏపూరు, కలపర్రు గ్రామాల్లో మట్టిని కొల్లగొట్టారు. -
ఇక రౌడీలపై పాజిటివ్ షీట్లు
సాక్షి, హైదరాబాద్: నేర ప్రవృత్తిని వీడనాడే రౌడీలపై ఇక నుంచి పాజిటివ్ షీట్లు తెరుస్తామని, దీంతో వారు చేసే మంచి పనులు కూడా రౌడీ షీట్ రికార్డులో నమోదవుతాయని, మార్పు పూర్తిగా వస్తే రౌడీ షీట్‌ను తొలగిస్తామని రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుదీర్ బాబు తెలిపారు. మార్పు కోసం ప్రయత్నించే రౌడీలకు సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. ఆదివారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో వందకు పైగా రౌడీ షీటర్లు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో నేరాలకు పాల్పడిన వారు వాటిని వీడనాడి ప్రస్తుత సమాజంతో నవజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాలని సూచించారు. తొందరపాటులో నేరాలు చేసి నా సరే.. తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందన్నారు. డాక్టర్ బిడ్డలు డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలు పోలీసులు అవుతున్నారని.. రౌడీ షీటర్ల పిల్లలు కూడా తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్తులుగా తయారు అవుతారని పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఇదో మంచి అవకాశమని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇక నుంచి డిసెంబర్ 31 అంటే రౌడీ మార్పు దినోత్సవంగా గుర్తిండిపోవాలని పిలుపునిచ్చారు. రౌడీషీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా నిరంతరం నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి ధారావత్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఎస్ఓటి డీసీపీ –1 గిరిధర్ రావుల, ఎస్ఓటి డీసీపీ–2 మురళీధర్ పాల్గొన్నారు. -
కేసులేవీ లేనప్పుడు రౌడీషీట్ మూసివేయాల్సిందే
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించిన తరువాత.. ఆ వ్యక్తిపై మరే ఇతర కేసులు లేనప్పుడు రౌడీషీట్ కొనసాగించడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. మర్రి గోపి అనే వ్యక్తిపై రౌడీషీట్ కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమంటూ, వెంటనే అతనిపై రౌడీషీట్‌ను మూసివేయాలని గుంటూరు జిల్లా, మంగళగిరి పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఇటీవల తీర్పునిచ్చారు. పోలీసులు తనపై రౌడీషీట్ తెరవడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా చినకాకానికి చెందిన మర్రి గోపి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కాలవ సురేశ్ కుమార్ రెడ్డి వాదనలు వినిపిస్తూ..2011లో పిటిషనర్‌పై హత్యానేరం కింద కేసు నమోదైందని, మంగళగిరి కోర్టు 2014లో పిటిషనర్‌పై కేసును కొట్టివేసిందన్నారు. అతనిపై మరో కేసు ఏదీ పెండింగ్‌లో లేదని, కేసు నమోదయినప్పుడు పోలీసులు పిటిషనర్‌పై రౌడీషీట్ తెరిచారని, కేసు కొట్టేసిన తరువాత కూడా దాన్ని కొనసాగిస్తున్నారని కోర్టుకు నివేదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తీర్పునిస్తూ పిటిషనర్ చర్యలు ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని నిరూపించేందుకు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిటిషనర్‌పై రౌడీషీట్ కొనసాగించడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పారు. కోర్టు కొట్టేసిన కేసు ఆధారంగా రౌడీషీట్ కొనసాగించడం సమర్థనీయం కాదని, అతడిపై రౌడీషీట్‌ను మూసివేయాలని పోలీసులను ఆదేశించారు. -
అచ్చెన్నాయుడి సోదరుడు, అనుచరులపై రౌడీషీట్
టెక్కలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరివరప్రసాద్, ప్రసాద్ కుమారుడు కింజరాపు సురేష్, అనుచరుడు కింజరాపు కృష్ణమూర్తిపై రౌడీషీట్ నమోదు చేసినట్లు టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, కోటబొమ్మాళి ఎస్ఐ రవికుమార్‌లు తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన కింజరాపు హరివరప్రసాద్, కింజరాపు సురేష్, కింజరాపు కృష్ణమూర్తి తదితరులను పలు కేసుల్లో ముద్దాయిలుగా గుర్తించి బైండోవర్ చేసినప్పటికీ.. ఆయా బైండోవర్ కేసులను సైతం ఉల్లంఘించడంతో రౌడీషీట్ తెరిచినట్లు పేర్కొన్నారు. రౌడీషీట్ తెరిచేందుకు పలు ఘటనల్లో నమోదు చేసిన కేసుల వివరాలు తెలియజేశారు. ► 2008లో నిమ్మాడలో కింజరాపు గణేష్ ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ చేస్తుండగా, అప్పటి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్, అనుచరులు కింజరాపు కృష్ణమూరి తదితరులు గణేష్, అతని కుమార్తెపై దాడికి పాల్పడ్డారు. దీనిపై గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 354, 323, 506 సెక్షన్లు, ఐపీసీ 34 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ► 2010లో నిమ్మాడకు చెందిన మెండ పోతయ్య ఉపాధి పనికి వెళ్తుండగా కింజరాపు హరివరప్రసాద్, మెండ బాబురావు తదితరులు పోతయ్యపై దాడికి పాల్పడ్డారు. బాధితుని ఫిర్యాదు మేరకు 341, 323, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ► 2020లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడకు చెందిన బమ్మిడి లక్ష్మి అనే మహిళ వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్ వేశారు. దీంతో కింజరాపు కృష్ణమూర్తి తదితరులు బమ్మిడి లక్ష్మిపై బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ► 2021లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిమ్మాడ సర్పంచ్‌గా వైఎస్సార్సీపీ తరఫున కింజరాపు అప్పన్న అప్పట్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించిన దువ్వాడ శ్రీనివాస్ సాయంతో నామినేషన్ వేసేందుకు వెళ్లగా వారిపై హత్యాప్రయత్నం చేశారు. హత్యాయత్నంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల విధులకు భంగం కలిగించిన కింజరాపు హరివరప్రసాద్, ఆయన కుమారుడు కింజరాపు సురేష్‌లపై 307, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ► మొత్తం కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న కింజరాపు హరివరప్రసాద్, కింజరాపు సురేష్, కింజరాపు కృష్ణమూర్తి తదితరులు బైండోవర్ కేసులను సైతం ఉల్లంఘించడమే కాకుండా భవిష్యత్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండేందుకు వారిపై రౌడీషీట్ నమోదు చేసినట్లు సీఐ, ఎస్ఐలు తెలిపారు. -
న్యాయవాదిపై రౌడీషీట్.. లాయర్స్ ఫైర్..!
సాక్షి, విజయవాడ: బెజవాడ పోలీసులు ఓ న్యాయవాదిపై అక్రమంగా రౌడీషీట్ నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన బెజవాడ బార్ అసోసియేషన్ నేటి నుంచి నాలుగు రోజుల పాటు కోర్టుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఈ రోజు నుంచి న్యాయవాదులు కోర్టు సెంటర్లో నిరసన దీక్షలు చేపట్టునున్నారు. బెజవాడ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. భవానీపురం పోలీస్ స్టేషన్లో న్యాయవాదిపై నమోదు చేసిన రౌడీషీట్ ఉపసంహరించుకోవాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. న్యాయవాదులు పోలీసుల వేధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. దీంతో లాయర్స్ తీవ్ర ఆందోళనకు దిగారు. -
మట్కారాయుళ్లపై రౌడీషీట్ తెరుస్తాం
- డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు హెచ్చరిక - ఇద్దరు నిర్వాహకులతోపాటు 13 మంది అరెస్ట్ - రూ.30 వేల నగదు, చీటీలు స్వాధీనం ఆదోని టౌన్: మట్కారాయుళ్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు అన్నారు. మితిమీరితే రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఈ నెల 5వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో 3 క్లోజులు, 6 ఓపన్లు అన్న శీర్షికన ప్రచురితమైన వార్తకు స్పందించిన డీఎస్పీ దాడులకు ఆదేశించారు. టూటౌన్ సీఐ గంటా సుబ్బారావు, ఎస్ఐలు రంగ,రమేష్ బాబు మంగళవారం సిబ్బందితో దాడి చేసి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. మట్కారిగేరికి చెందిన షబీర్ బాషా, కృష్ణ నిర్వహిస్తుండగా వివిధ గ్రామాలకు చెందిన 13 మంది మట్కా రాస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30,610 నగదు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పర్చారు. మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులకు డీఎస్పీ చేతుల మీదుగా నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో సీఐలు గంటా సుబ్బారావు, రామానాయుడు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.