రౌడీఛీటర్‌ చింతమనేని  | Attack on then minister Vatti Vasanthkumar in capacity of MLA | Sakshi
Sakshi News home page

రౌడీఛీటర్‌ చింతమనేని 

Published Sat, Apr 13 2024 6:07 AM | Last Updated on Sat, Apr 13 2024 6:07 AM

Attack on then minister Vatti Vasanthkumar in capacity of MLA - Sakshi

..ఇది తప్పన్న పాపానికి మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళతాడొకడు..

అధిక వడ్డీలకు అప్పులిచ్చి,గడువులోగా తీర్చలేదన్న సాకుతో పక్కకు రమ్మంటున్న వారిని వెనకేసుకొస్తాడు ఇంకొకడు..

ప్రకృతిని చెరబట్టడానికే పుట్టామన్నట్లు వ్యవహరిస్తాడు మరొకడు.. చిన్నారులని కూడా చూడకుండా లైంగికంగా వేధించే వెధవలకు అండగా నిలుస్తాడొక దుర్మార్గుడు..

ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, లేదంటే కడుపైనా చేయాలని నిస్సిగ్గుగా, సందేశంగా చెబుతాడో నేత..

‘అసలు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని స్వయంగా పార్టీ అధినేతే హేళన చేస్తాడు.. ఇలాంటి వాళ్లంతా ప్రజలను ఉద్దరిస్తారట!

ప్రజలను పీల్చి పిప్పి చేయడంలో వీరందరిదీ అందె వేసిన చేయి. ఇలాంటి టీడీపీలో ఒక్కో నేతది ఒక్కో చీకటి చరిత్ర.నేటి నుంచి ఒక్కొక్కరి బాగోతాన్ని‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.

ఎమ్మెల్యే హోదాలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి 

తహసీల్దార్‌ వనజాక్షి జుట్టుపట్టి ఈడ్చి దాడి చేసిన వైనం.. చంద్రబాబు హయాంలోనే రౌడీషిట్‌

అత్యంత వివాదాస్పద రాజకీయ నేతగా ముద్ర 

ఎస్సీలకు రాజకీయాలు ఎందుకురా.. అంటూ తీవ్ర స్థాయిలో దూషణ 

పవన్‌ కళ్యాణ్‌.. వాళ్ల అన్న చిరంజీవినే గెలిపించలేనివాడు అంటూ వ్యక్తిగత విమర్శలు 

ప్రజా ప్రతినిధిగా ఉన్న సమయంలో పోలవరం కుడికాల్వ విధ్వంసం 

5 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ మింగిన మహా అవినీతిపరుడు 

కొల్లేరులోనూ వందల ఎకరాల్లో సొంతంగా అక్రమ సాగు 

1,860 ఎకరాల అక్రమ సాగులో అడ్డగోలుగా కమీషన్ల దందా 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘మీరు దళితులు, మీరు వెనుకబడిన వారు, మీరు షెడ్యూల్డ్‌ కాస్ట్‌ వారు... రాజకీయాలు మాకుంటాయి..మాకు పదవులు... మీకెందుకురా పిచ్చముండా కొడకల్లారా గొడవలు...’’ ఇదీ ఏలూరు జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలోని దళిత పేటలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళిత సామాజికవర్గంపై తీవ్ర అసభ్య పదజాలంతో చేసిన వ్యాఖ్యలు.  ‘‘పవన్‌కళ్యాణ్‌.. వాడి వల్ల ఏం అవుతుంది. వాడి అన్న చిరంజీవి లాంటి వాడినే గెలిపించుకోలేనివాడు.. మమ్మల్ని ఏమి చేస్తాడు... మేము గతంలో 2014లో వాడి బొమ్మపై గెలిచామా..’’ అంటూ దురహంకారపూరిత వ్యాఖ్యలు.

దెందులూరులోని ఎన్‌టీఆర్‌ బొమ్మ సెంటర్‌ వద్ద జనసేన నేత పవన్‌ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలివి. దెందులూరు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని నోటి దురుసుతో పాటు తీవ్ర వివాదాస్పద వైఖరితో ప్రతి ఒక్కరిపై దాడులు చేయడంలో సిద్ధహస్తుడు. జర్నలిస్టు మొదలుకొని మంత్రి వరకు అందరిపై దాడి చేసిన ఏకైక రికార్డు కలిగిన రాజకీయ నేత. 85కి పైగా కేసులు చింతమనేనిపై ఉన్నాయని గత డీజీపీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. 40కి పైగా క్రిమినల్‌ కేసులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ విప్‌ హోదాలో ఉన్న చింతమనేనిపై ఏలూరు త్రీటౌన్‌లో రౌడీషిట్‌ తెరిచారు.

అత్యంత వివాదాస్పద వ్యక్తిగా రాష్ట్రంలో గుర్తింపు ఉన్న చింతమనేని అన్ని వర్గాలను దూషించి, అందరితో ఘర్షణలకు దిగినా కనీసం క్షమాపణలు కూడా చెప్పని తలపొగరు రాజకీయం సాగిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొల్లేరు అక్రమ చేపల సాగు, పోలవరం కుడికాల్వ, తమ్మిలేరు ఇసుకను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని వందల కోట్ల సహజ సంపద బహిరంగంగా దోపిడీకి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి యతి్నంచిన పోలీస్, అటవీ శాఖ, రెవెన్యూ, మైనింగ్‌ శాఖ సిబ్బందిపై దాడులుకు దిగిన ఘటనలు కోకొల్లలున్నాయి. 10 ఏళ్ళ ఎమ్మెల్యే పదవి కాలంలో వందల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి.  

పోలవరం గట్లు మాయం 
పోలవరం కుడికాల్వ గట్టు 20 కిలోమీటర్ల మేర ఐదేళ్లలో పూర్తిగా మాయం చేసిన ట్రాక్‌ చింతమనేనిది. పోలవరం నుంచి 180 కిలోమీటర్ల మేర కాల్వ నిర్మాణం ఉండగా దెందులూరు నియోజకవర్గం చల్లచింతలపూడి నుంచి పెదపాడు మండలం వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర ఉంది. 240 అడుగుల వెడల్పుతో కాల్వను నిరి్మంచడానికి భూసేకరణ చేసి 240 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో 80 అడుగుల మేర కాల్వ తగ్గి, కుడి, ఎడమ వైపు 80 అడుగుల మేర పోలవరం గట్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 అడుగుల లోతుతో కాల్వను తవ్వారు.

కాల్వను తత్విన మట్టితో పాటు కుడి, ఎడమ వైపు తత్విన గట్లపై ఉన్న గ్రావెల్‌నూ కొల్లగొట్టారు. దెందులూరు నియోజకవర్గంలోనే లక్ష క్యూబిక్‌ మీటర్ల మేర మట్టిని కొల్లగొట్టినట్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అప్పటి విజిలెన్స్, ఇరిగేషన్‌ అధికారులు నిర్ధారించారు. 17 క్యూబిక్‌ మీటర్ల చొప్పున ఒక లారీ లోడు దింపి ప్రతిరోజూ 200 టిప్పర్లు, కొన్నేళ్ళపాటు నిరాటంకంగా నిర్వహించి మట్టి దోపిడీకి పాల్పడ్డారు. 

85కుపైగా కేసులు  
అన్ని రకాల కేసులు 85కు పైగానే చింతమనేనిపై ఉన్నాయి. వీటిలో సగం కేసులు కోర్టుల్లో కొట్టి వేయగా, మరికొన్ని నడుస్తున్నాయి. 26 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. గతంలో ట్రాఫిక్‌ వి«ధులు నిర్వహిస్తున్న కొవ్వూరు ఏఎస్‌ఐ, సీపీఓలపై దాడిచేసిన కేసుతోపాటు తెలంగాణలోనూ కోడిపందేల కేసులు ప్రభాకర్‌పై నమోదు కావడం విశేషం. ప్రధానంగా తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి కేసులో చింతమనేని, ఆయన గన్‌మెన్, మరో 58 మందిపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు ఐపీసీ సెక్షన్‌ 353, 332, 379, రెడ్‌ విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. 2011 నవంబర్‌ 26న దెందులూరులో జరిగిన రచ్చబండలో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని దాడి చేసిన ఘటనలో ఐపీసీ సెక్షన్‌ 506, 353, 332, రెడ్‌ విత్‌ 34 కింద కేసు నమోదు చేశారు. భీమడోలు కోర్టులో రెండేళ్లు జైలుశిక్ష విధించారు. దీనిపై ప్రస్తుతం ఏలూరు జిల్లా కోర్టులో అప్పీల్‌ కేసు కొనసాగుతోంది.  
మాజీ మంత్రి వట్టి వసంత్‌పై దాడి 
2011 నవంబర్‌ 26న దెందులూరు ఉన్నత పాఠశాలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో అప్పటి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వట్టి వసంత్‌ కుమార్‌పై అప్పటి ఎమ్మెల్యేగా పదవిలో ఉన్న చింతమనేని ప్రభాకర్‌ దాడి చేశారు. వట్టి వసంత్‌కుమార్‌తో   మాటామాటా పెరిగి చింతమనేని అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదై భీమడోలు జూనియర్‌ సివిల్‌ కోర్టులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు నిర్ధారణ కావడంతో జడ్జి కె.దీపదైవకృప రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై చింతమనేని అప్పీల్‌కు వెళ్లారు.  

తమ్మిలేరును మింగేశారు 
తెలంగాణ రాష్ట్రం నుంచి ఏజెన్సీ ప్రాంతం మీదుగా ఏలూరు నగరం నుంచి కొల్లేరు వరకు విస్తరించి ఉన్న తమ్మిలేరు ప్రధాన కాల్వను చింతమనేని అండ్‌ ముఠా మింగేసింది. దెందులూరు నియోజకవర్గంలో తమ్మిలేరు ఎక్కువగా ఉండటం, తమ్మిలేరు పరీవాహక ప్రాంతంలో నాణ్యత ఉన్న ఇసుక ఉండటంతో దెందులూరు, నూజివీడు నియోజకవర్గాల్లోని తమ్మిలేరు పరీవాహక ప్రాంతాలంతా గట్టిగా కొల్లగొట్టారు. ప్రధానంగా పెదవేగి మండలంలో విజయరాయి నుండి ప్రారంభమై నడిపల్లి, బలివే, సూర్యారావుపేట, తమ్మిలేరు, చింతలపూడి నియోజకవర్గం వలసపల్లి వద్ద తమ్మిలేరు  24 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

ఒక రాత్రికి 200 లారీలు చొప్పున దాదాపు 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను దోచేశారు. దోపిడీ ప్రస్థానాన్ని దెందులూరుతో పాటు పక్క నియోజకవర్గమైన నూజివీడులో కూడా చొరబడి ముసునూరు మండలంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే 2015 జూన్‌లో ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బిందువయ్యారు.  

తహసీల్దార్‌ వనజాక్షి జుట్టు పట్టుకుని దాడి 
2015 జూలై 11న ముసునూరులో చింతమనేని అనుచరులు అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో అప్పటి ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షి ఇసుక ట్రాక్టర్లకు అడ్డుపడి గట్టిగా నిలువరించారు. దీంతో సమాచారం తెలుసుకున్న చింతమనేని హుటాహుటిన అక్కడకు చేరి మహిళా అధికారి, మండల మేజిస్ట్రేట్‌ అని కూడా చూడకుండా జుట్టుపట్టి ఈడ్చి పక్కకు పడేసి దాడి చేయడంతో పాటు నానా దుర్భాషలాడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదైన వెంటనే బెయిల్‌ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడం, రెవెన్యూ తిరుగుబాటుతో చంద్రబాబు దిగి వచ్చి వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశారు.

చింతమనేనిపై 2015లో ఏలూరు త్రిటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరిచారు. అలాగే ఆటపాక పక్షుల కేంద్రం వద్ద అటవీ శాఖాధికారిపై దాడి, ఐసీడీఎస్‌లో పనిచేసే మహిళా అధికారులపై బెదిరింపులకు దిగడం, 2016 ఫిబ్రవరి 10న కానిస్టేబుల్‌ మధుపై దాడి ఘటనలకు చింతమనేని పాల్పడ్డారు.  

కొల్లేరులో చేపలు మాయం 
కొల్లేరులో చేపలను మాయం చేసిన ఘనత చింతమనేనిది. అటవీ శాఖ అధికారులను బెదిరించి మరీ కొల్లేరులో ఆక్రమణలకు దిగి చెరువులను స్థానిక టీడీపీ నేతలతో సాగు చేయించారు. అడ్డుకోవడానికి వెళ్లిన రెవెన్యూ, అటవీశాఖ అధికారులకు.. కొన్ని సమయాల్లో చెక్‌పోస్టుల వద్ద పోలీసులపై తన నోటికి, చేతికి పని చెప్పడంతో కేసులు నమోదైన ఘటనలు అనేకం. మొత్తం 1,860 ఎకరాల్లో చేపల చెరువులు పూర్తిగా చింతమనేని కనుసన్నల్లోనే సాగైనట్టు అంచనా. ఒక్క కొల్లేరులోనే సగటున రూ.వంద కోట్లకుపైగా  దోచినట్లు సమాచారం. పెదవేగి మండలం పెదవేగి (సూర్యారావుపేట) లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు చేయకుండా  దాదాపు 70 ఎకరాల్లో గ్రావెల్‌ దోచేశారు. పెదపాడు మండలం ఏపూరు, కలపర్రు గ్రామాల్లో మట్టిని కొల్లగొట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement