అనంతపురం జిల్లాలో మట్కా కింగ్‌గా చెలామణి అవుతున్న మట్కా బీటర్ రంగనాయుడును పోలీసులు అరెస్టు చేశారు. కదిరి పోలీసులు శుక్రవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నుంచి రూ. 2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అతని పై కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా బహిష్కరణ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.