
నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు
మట్కా ఆడుతున్న ఐదుగురు నిందితులను రామగుండం సీఐ వాసుదేవరావు, ఎన్టీపీసీ ఎస్సైలు అరెస్టు చేశారు.
లక్షా 60 వేలు స్వాధీనం
రామగుండం సీఐ వాసుదేవరావు
జ్యోతినగర్: మట్కా ఆడుతున్న ఐదుగురు నిందితులను రామగుండం సీఐ వాసుదేవరావు, ఎన్టీపీసీ ఎస్సైలు అరెస్టు చేశారు. బుధవారం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొద్ది రోజులుగా ఎన్టీపీసీ ఏరియాలో మట్కా ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై చంద్రకుమార్ తనిఖీ చేపట్టారు. టెంపరరీ టౌన్‌షిప్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
దీంతో మట్కా ఆడుతున్నట్లు వెల్లడైందన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన మాదాసు రాజు(35), గోదావరిఖని అశోక్‌నగర్‌కు చెందిన పాశం వివేక్(30), ఒల్లోజుల నరేష్‌కుమార్(37), లక్ష్మీనగర్‌కు చెందిన కొట్టె లక్ష్మణ్(50), హన్మాన్‌నగర్‌కు చెందిన కోండ్ర సారయ్య(31)లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి వద్ద లభించిన రూ1,60 వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మట్కా కేసును చేధించిన ప్రభాకర్‌రావు, రమేశ్, సుధాకర్, సోమరాజు, రవీందర్‌ను సీఐ వాసుదేవరావు అభినందించారు.