మట్కా నిర్వాహకురాలు అరెస్ట్‌ | Matka Hoster Arrested In YSR Kadapa District | Sakshi
Sakshi News home page

మట్కా నిర్వాహకురాలు అరెస్ట్‌

Published Fri, May 4 2018 12:10 PM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM

Matka Hoster Arrested In YSR Kadapa District - Sakshi

ప్రొద్దుటూరు క్రైం :    స్థానిక కాలువకట్ట సమీపంలోని గుడి వద్ద దండె సిద్ధమ్మ అనే మట్కా నిర్వాహకురాలిని అరెస్ట్‌ చేసి ఆమె వద్ద నుంచి త్రీ టౌన్‌ పోలీసులు రూ. 1 లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరావు గురువారం సాయంత్రం త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. దండె సిద్ధమ్మ కాల్వకట్ట ప్రాంతంలో కొన్ని రోజుల నుంచి మట్కా నిర్వహిస్తోంది. త్రీ టౌన్‌ మహిళా కానిస్టేబుల్‌ సరోజ, మరో కానిస్టేబుల్‌ గంగాధర్‌లు వీధుల్లో సంచరిస్తుండగా మట్కా రాస్తున్న సిద్ధమ్మ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు ఆమెను వెంటాడగా వారిని తోసి విధులకు ఆటంకం కలిగించింది. ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. గతంలో ఆమెపై రూరల్, త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లలో మట్కా కేసులు ఉన్నాయి. ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వివరించారు. మట్కా నిర్వాహకురాలిని అరెస్ట్‌ చేసి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్న ఎస్‌ఐలు కృష్ణంరాజునాయక్‌ , నరసయ్య, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement