మట్కా మాయ | Hundreds Of Families Depressed In The Name Of Matka Business | Sakshi
Sakshi News home page

మట్కా మాయ

Published Sat, Jun 29 2019 11:52 AM | Last Updated on Sat, Jun 29 2019 11:52 AM

Hundreds Of Families Depressed In The Name Of Matka Business

సాక్షి, సదాశివపేట(సంగారెడ్డి): రూపాయికి 80 తగులుతుందని ఆశపెడుతూ పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని మట్కా జూదం సాగుతుంది. మట్కా తగలడం మాటేమోగాని, మట్కా రాపిస్తున్న ఏజెట్లు మాత్రం రూ.లక్షలకు పడగలెత్తుతున్నారు. మట్కా జిల్లాలో చాపకింద నీరులో వ్యాప్తి చెందుతుంది. దీని మాయలోపడి అనేక మంది జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి.

వివిధ కంపెనీల పేరుతో మట్కానడుపుతున్న నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లు చెట్లకింద, కాలనీలు, ఫౌంహౌజ్‌ల్లో మట్కా రాసే ఏజెట్లు సెల్‌ఫోన్లు ఇంటర్‌నెట్‌లతోపాటు బహిరంగంగా మట్కా రాస్తున్నారు. ఒక సారి ఈ రొచ్చులో దిగితే బయట పడడం కష్టం, ఒక మట్కా చార్టు పెట్టుకుని అంకెలగారడీ చేసుకుంటూ ఉండాల్సిందే. వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగులు, కార్మికులు, వివిధ పార్టీల నాయకులు, యువకులు విద్యార్థులు సైతం దీనికి అలవాటుపడి బయటపడలేక పోతున్నారు.  

పోలీసులకు సవాలుగా మట్కా 
మట్కా ఉచ్చులోపడి వందలాది కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మట్కాను నియంత్రించాల్సిన పోలీసులశాఖ కిందిస్థాయి అధికారులు మట్కా ఏజెంట్ల వద్ద నెల వారి మాముళ్లు తీసుకుని ఉరుకుంటున్నారని సమాచారం, పోలీసులకు మాముళ్లు ఇవ్వని ఏజెంట్లను గంజాయి కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారే తప్ప నివారణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

మట్కా అంటే పోలీసులకు ఒకరిద్దరు మాత్రమే గుర్తుకు వచ్చి వారిని పట్టుకుని గంజాయి కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారని సమాచారం. జిల్లాలోని సదాశివపేట, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు, జోగిపేట తదితర పట్టణాలు గ్రామాల్లో మట్కా జోరుగా సాగుతుందని విశ్వసనీయ సమాచారం.   

గల్లీకో మట్కా ఏజెంట్‌.. 
సదాశివపేట పట్టణంలో పోలీసులకు ఐదారు మంది మాత్రమే మట్కా ఏజెంట్లు ఉన్నారని అనుకుంటూ వారి వద్దకే కానిస్టెబుళ్లు వెళ్లి నెలనెల మాముళ్లు తీసుకుంటున్నారని సమాచారం. కాని పట్టణంలో గల్లీకో మట్కా ఏజెంట్లు తయారై మట్కా రాపిస్తున్నారు. మట్కా జూదం సదాశివపేట పట్టణంలో విచ్చల విడిగా బహిరంగంగా కొనసాగుతున్న పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని బహిరంగ రహస్యమే.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement