
మట్కా నిర్వాహకుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లను చూపుతున్న పోలీసులు
గోరంట్ల: పుట్టపర్తి కేంద్రంగా గోరంట్ల, హిందూపురం తదితర ప్రాంతాల్లో మట్కా నిర్వహిస్తున్న ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్దనుండి రూ. 30,900 నగదుతో పాటు మట్కా చీటీలు, 7 సెల్‌ఫోన్లను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ధర్మవరం డీఎస్పీ వెంకటరమణ తెలిపిన వివరాలమేరకు.. గోరంట్లలోని మధవరాయ దేవాలయ సమీపంలో గోరంట్లకు చెందిన షరిప్‌సాబ్, శ్రీనివాసులు అనే ఇద్దరు బీటర్లను అరెస్టు చేసి విచారణ చేపట్టగా హిందూపురానికి చెందిన అంబురి బాబాజన్ ఉరుప్ (చికన్‌బాబా) పుట్టపర్తిలోని ఒక అపార్టుమెంట్‌లో తన బావమరిది అతావుల్లా సహయంతో రహస్యంగా మట్కా కంపెనీ నిర్వహిస్తున్నాడన్నారు. దీంతో పోలీసు బృందం దాడులు చేసి అతావుల్లాతో పాటు హిందూపురానికి చెందిన నాగరాజు, ఆదినారాయణలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment