మట్కా బీటర్లు శ్రీనివాసులు దంపతులను హెచ్చరిస్తున్నడీఎస్పీ
నంద్యాల ప్రాంతంలోని మట్కా గ్యాంగ్‌లపై పోలీసులు దాడులు చేసి 8మందిని అరెస్ట్ చేశారు.
నంద్యాల: నంద్యాల ప్రాంతంలోని మట్కా గ్యాంగ్‌లపై పోలీసులు దాడులు చేసి 8మందిని అరెస్ట్ చేశారు.రూ.లక్షను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం డీఎస్పీ హరినాథరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. స్థానిక బైర్మల్‌వీధి పాత దీపక్ లాడ్జి ప్రాంతంలోని ఇంట్లో మట్కా ఆర్గనైజర్ గొల్ల శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో సహా గ్యాంగ్‌ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి, వన్‌టౌన్ ఎస్‌ఐ రమణ దాడులను నిర్వహించారని చెప్పారు. గొల్ల శ్రీనివాసులుతో పాటు అతని భార్య పుష్పావతమ్మను అరెస్ట్ చేసి రూ.74,900, రెండు సెల్‌ఫోన్లను, మట్కా చీటిలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మట్కా బీటర్లు షేక్‌అక్బర్(రాణి మహారాణి ఏరియా) నుంచి రూ.6,300, కొప్పరి ఏసుదాసు, దాట్ల వెంకటేశ్వర్లు(కొత్తపల్లె) నుంచి రూ.7950, అల్ల బ్రహ్మానందరెడ్డి(పొన్నాపురం) నుంచి రూ.3100, షేక్‌జాకీర్(నందమూరినగర్) నుంచి రూ.2400, కమ్మకాపు అశోక్ (వీసీకాలనీ) నుంచి రూ.5600 నగదును, మట్కా చీటిలను, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దాడులు నిర్వహించిన సీఐ మురళీధర్, ఎస్‌ఐలు గోపాల్‌రెడ్డి, రమణా, హెడ్‌కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, సుధీష్, కానిస్టేబుళ్లు మల్లికార్జున, నాగరాజు, శ్రీనివాసులు, చంద్రశేఖర్, మద్దిలేటి, భూమా కుమారిలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.