
మట్కా బీటర్ల అరెస్ట్
జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్‌ఐలు బాల మద్దిలేటి, గౌస్ హుసేన్....
రూ. 2,10,300 నగదు స్వాధీనం
క్రైం (కడప అర్బన్) : జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్‌ఐలు బాల మద్దిలేటి, గౌస్ హుసేన్, టుటౌన్ ఎస్‌ఐలు ఎస్వీ నరసింహారావు, రోషన్‌లు తమ సిబ్బందితో శనివారం సాయంత్రం రవీంద్రనగర్, మార్కెట్‌యార్డు ప్రాంతాలలో మట్కా రాస్తున్న 11 మందిని రెండు సంఘటనల్లో అరెస్టు చేశారు. 11 మంది వద్దనుంచి రూ. 2,10,300 నగదు, మట్కా స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కడప తాలూకా పోలీసుస్టేషన్‌లో శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ సదాశివయ్య మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు 11 మంది మట్కా బీటర్లను అరెస్టు చేశామన్నారు. రవీంద్రనగర్ వద్ద అరెస్టు చేసిన వారిలో షేక్ జిలానీ, మస్తానయ్య, రాంగోపాల్, నాగప్ప, శ్రీనివాసాచారిలు ఉన్నారు.
టుటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో మార్కెట్‌యార్డు సమీపంలో ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు అయిన వారిలో షేక్ అన్వర్‌బాష, మహమ్మద్ అలీ, మహబూబ్‌బాష, ఖాదర్ హుసేన్, పఠాన్ అమీర్‌ఖాన్, షేక్‌కరీముల్లాలు ఉన్నారన్నారు. వీరంతా మట్కా రాసి నంద్యాల, జమ్మలమడుగు ప్రాంతాల్లోని వారికి ఇస్తున్నారని విచారణలో తెలిసిందన్నారు. వారిని కూడా అరెస్టు చేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు.