విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో మంగళవారం ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 తులాల బంగారం, అరకిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో మంగళవారం ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 తులాల బంగారం, అరకిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మంగళవారం తనిఖీల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని నర్సీపట్నం పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని ఆదోనిలో మంగళవారం మట్కా నిర్వహకుడిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 6.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని ఆదోని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే పోలీసులు అతడి స్కార్పియో వాహనాన్ని స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. మట్కా నిర్వహకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.