లేపాక్షి : మండల కేంద్రంలోని కంచిసముద్రం రోడ్డు పక్కన మట్కా ఆడుతున్న ఐదుగురు మట్కారాయుళ్లను శనివారం సాయంత్రం అరెస్ట్ చేసినట్టు ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు. మట్కా ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అయితే ఐదుగురు మట్కారాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2,040 స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని వారిని సోమవారం హిందూపురం కోర్టులో హాజరు పరచనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.