
అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అశోక్‌కుమార్
అనంతపురం సెంట్రల్: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతా ల్లోని అమాయకులకు అత్యాశచూపి వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్న అంతర్‌రాష్ట్ర మట్కా కంపెనీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. హుబ్లీ కేంద్రంగా అనంతపురం, కర్నూలు జిల్లాలో మట్కా ఆడిస్తున్న అంతర్‌రాష్ట్ర మట్కా నిర్వాహకుడు, గంజాయి విక్రేతలతో సహా మొత్తం ఆరుగురిని అనంతపురం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు కిలోల గంజాయి, రూ. 20.25 లక్షల నగదు, కారు, మూడు సెల్‌ఫోన్లు, మట్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను శుక్రవారం పోలీసుకాన్ఫరెన్స్‌హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో వినాయక్ మేత్రాని (కర్ణాటక రాష్ట్రం హుబ్లీ), తమటం రమేష్ గౌడ్ (కర్నూలు జిల్లా డోన్), హబీబ్‌ఖాన్ (గుత్తి), జమాల్‌బాషా (హుబ్లీ), పట్నూరు షబ్బీర్‌బాషా (అనంతపురం రూరల్ మండలం పిల్లిగుండ్ల కాలనీ), పోతుల శంకర్ (బిందెల కాలనీ) ఉన్నారు.
గుట్టు రట్టయ్యిందిలా..
అరెస్టయిన వారిలో వినాయక్ మే త్రాని అంతర్‌రాష్ట్ర మట్కా నిర్వాహ కుడు, గంజాయి విక్రేత. కర్ణాటక రా ష్ట్రం ధార్వాడ కేంద్రంగా మట్కా ని ర్వహిస్తున్నాడు. ఇతని కంపెనీకి అనుబంధంగా పట్టుబడిన మిగతా నిందితులు అనంతపురం, గుత్తి, క ర్నూలు జిల్లా డోన్‌లలోగుట్టుచప్పు డు కాకుండా మట్కా కొనసాగిస్తున్నారు. అమాయక ప్రజల అత్యాశ ను పెట్టుబడిగా మలుచుకొని రూ. కోట్లు అర్జిస్తున్నారు. దీంతో పాటు గంజాయిని కూడా విక్రయిస్తూ అమాయకులను మత్తుకు బానిస చేస్తున్నారు. మట్కా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అశోక్‌కుమార్‌నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. శుక్రవారం చెరువుకట్ట కింద నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో డీఎస్పీ వెంకట్రావ్ పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ భాస్కర్‌గౌడ్, రూరల్‌సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐలు హమీద్‌ఖాన్, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు సిబ్బంది ప్రత్యేక బృందంగా వారిని అరెస్ట్ చేశారు.
అవసరమైతే పీడీ యాక్ట్ కేసు..
అంతర్‌రాష్ట్ర మట్కా కంపెనీ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లా మట్కాను పూర్తిగా నిర్మూలిం చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే వారి పై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతర్‌రాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన డీఎస్పీ వెంకట్రావ్, సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను ఎస్పీ ప్రశంసించారు. జిల్లాలో ఎక్కడైనా ఈ తరహా నేరాలు జరుగుతుంటే డయల్–100, 9989819191 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment