Interstate
-
ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీలను ఎత్తేసిన కేంద్రం..
న్యూఢిల్లీ: ఆఫ్‌షోర్ పవన, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులపై ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ చార్జీలను ఎత్తివేస్తూ 25 ఏళ్లపాటు ఉపశమనాన్ని కేంద్ర సర్కారు కల్పించింది. 2032 డిసెంబర్ 31 వరకు కార్యకలాపాలు ప్రారంభించే ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్/గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. కర్బన ఉద్గారాల నియంత్రణకు, పర్యావరణ అనుకూల ఇంధనాల తయారీకి మద్దతుగా కేంద్ర సర్కారు తీసుకుంటున్న ఎన్నో చర్యల్లో దీన్ని కూడా ఒక భాగంగా చూడొచ్చు. ఇదీ చదవండి: Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! రేపటి నుంచి పెరగనున్న ధరలు -
వేలి ముద్రలు వేస్తున్నారా?.. అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే..
వైఎస్సార్ జిల్లాలో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోని రూ.90 వేలు ఎవరో విత్‌డ్రా చేశారని పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై కడప పోలీసులు విచారణ చేపట్టగా.. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా దందా సాగిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల ముఠా గుట్టు రట్టయింది. ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న దందా బట్టబయలైంది. కడప పోలీసులు ఈ కేసును విజయవంతంగా ఛేదించి సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు. విశాఖపట్నంలో ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.1.50 లక్షలు గల్లంతయ్యాయి. దీనిపై విచారించగా హరియాణలోని ఓ ముఠా దందా వెలుగుచూసింది. ఆన్లైన్లో రుణాలు ఇస్తామని చెప్పి ఓ సంస్థ ఆయన ఆధార్‌కార్డు, పాన్‌కార్డు కాపీలతోపాటు వేలిముద్రలు కూడా తీసుకుంది. అనంతరం క్లోనింగ్ ద్వారా ఆయన బ్యాంకు ఖాతాల్లోని నగదును విత్‌డ్రా చేసేసింది. సాక్షి, అమరావతి: దేశంలో కొత్తరూపు సంతరించుకుంటున్న సైబర్ నేరాలకు తాజా ఉదాహరణలు ఇవి. ఏఈపీఎస్ ఖాతాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల క్లోనింగ్ ద్వారా వారి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. మన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఈ తరహా సైబర్ నేరాలు అధికమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ప్రకారం గత ఆరునెలల్లో దాదాపు నాలుగువేల కేసులు నమోదవడం ఈ తరహా సైబర్ నేరాల తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ రీతిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలు అత్యధికంగా హరియాణలో కేంద్రీకృతం కాగా.. మరికొన్ని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ల నుంచి దందా సాగిస్తున్నాయని సైబర్ పోలీసుల విభాగం గుర్తించింది. సైబర్ మోసం ఇలా.. సైబర్ నేరగాళ్లు ఏఈపీఎస్ను దుర్వినియోగం చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదును కొట్టేస్తున్నారు. అందుకోసం రెండుమూడు తరహాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ముందుగా వివిధ వెబ్సైట్ల నుంచి వ్యక్తుల వేలిముద్రలను ‘బటర్ పేపర్’పై కాపీచేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ, ట్రెజరీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు, ఆన్లైన్ రికార్డుల్లో నమోదైన వేలిముద్రలను కాపీచేస్తారు. అనంతరం క్లోనింగ్ ద్వారా నకిలీ సిలికాన్/రబ్బర్ వేలిముద్రలు తయారు చేస్తారు. ఆధార్ నంబరు అనుసంధానమైన వ్యక్తుల పేరిట ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆన్లైన్ బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. దీంతో ఆ వ్యక్తుల అసలైన ఆన్లైన్ ఖాతాలు, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌లు వారి నియంత్రణలోకి వస్తాయి. అనంతరం తాము క్లోనింగ్ చేసిన వేలిముద్రలు ఉపయోగించి ఖాతాల్లోని నగదును కొల్లగొడుతున్నారు. మరికొన్నిసార్లు బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్స్, ఏజెంట్స్ కస్టమర్ సర్వీస్ పాయింట్లో బయోమెట్రిక్ డివైజ్ స్కానర్స్తో స్కాన్‌చేసి నగదు లాగేస్తున్నారు. మరికొన్ని ముఠాలు ఏకంగా ఆన్లైన్ రుణ కంపెనీల పేరిట నకిలీ సంస్థలను ప్రారంభిస్తున్నాయి. రుణాలు ఇస్తామని ఆన్లైన్లో ప్రకటనలు చేస్తున్నాయి. రుణాల కోసం తమను సంప్రదించే వ్యక్తుల పాన్‌కార్డులు, ఆధార్‌కార్డుల కాపీలు, వేలిముద్రలు కూడా తీసుకుంటున్నాయి. అనంతరం క్లోనింగ్ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోని నగదును తస్కరిస్తున్నాయి. ఆధార్ నంబర్లతో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోని నగదును పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా కూడా సిఫోనింగ్ చేసి మరీ ఇతర ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఇలా పలు రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తతే శ్రీరామరక్ష బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. అందుకు ఖాతాదారులతోపాటు ప్రభుత్వ సంçÜ్థలకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ♦కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమ వెబ్సైట్లను ఎవరూ హ్యాక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦తమ వెబ్సైట్లను తరచు సేఫ్టీ ఆడిట్ చేయాలి. ♦ప్రజల వ్యక్తిగత సమాచారం లీక్‌కాకుండా తగిన ప్రమాణాలు పాటించాలి. ♦అందుకోసం కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఖాతాదారులకు సూచనలు ఏఈపీఎస్ విధానాన్ని తరచు వినియోగించని ఖాతాదారులు ఆ సౌలభ్యాన్ని ఉపసంహరించుకోవాలి. వెబ్సైట్లలో తమ వేలిముద్రలు నమోదు చేయకూడదు. ఎటువంటి వ్యవహారం కోసమైనా సరే వేలిముద్రలు అడిగితే తిరస్కరించాలి. తమ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని గుర్తిస్తే 24 గంటల్లోనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దీంతో వారి ఖాతానుంచి నగదు బదిలీ అయిన ఖాతాను సైబర్ పోలీసులు స్తంభింపజేయడానికి అవకాశం ఉంటుంది. సైబర్ నేరం జరిగినట్టు తెలియగానే ఏపీ సైబర్‌మిత్ర (వాట్సాప్ నంబర్ 9121211100)నుగానీ, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (1930)ను గానీ సంప్రదించి ఫిర్యాదు చేయాలి. చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది.. -
శిశు శోకం: ఏమైందో తెలియదు.. వీళ్లెవరో నన్నెత్తుకొచ్చారు..
‘ఆకలైనప్పుడల్లా పాలు తాగాను. నువ్విచ్చే ముద్దులతో మురిసిపోయాను. నీ ఒడిలో ఆడుకున్నాను. నీ వెచ్చని స్పర్శతో హాయిగా నిద్రపోయాను. ఏమైందో తెలియదు గానీ.. వీళ్లెవరో నన్నెత్తుకొచ్చారు. అంగట్లో బొమ్మలా.. నన్ను వేరొకరికి అమ్మారు. నాకేదో ప్రాణాంతక వ్యాధి ఉందని డాక్టర్లు చెప్పడంతో.. తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు నాకే తెలియని లోకమైన శిశుగృహలో ఉన్నాను. నీ ఒడి చేరాలనుంది. నీ చనుబాలు తాగాలనుంది.’ అని ఆ శిశువుల ఆక్రందనలు వింటే అర్థమవుతోంది. తల్లికి దూరమైన ఇద్దరు శిశువులు గుక్క పట్టి ఏడుస్తున్నారు. – సాక్షి, వరంగల్ ఓరుగల్లు కేంద్రంగా అంతర్రాష్ట అక్రమ రవాణా ముఠా సభ్యులు శిశువులను విక్రయిస్తున్నారని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. శిశువులను సంరక్షించారు. నెలల వయసు లేని ఆ పసిబిడ్డలు ఆక్రందనలు చేస్తున్నా.. తల్లుల ఆచూకీ ఇంకా దొరక్కపోవడం విచారకరం. గత నెల 14న శిశువుల విక్రయ ముఠాను పట్టుకున్నా.. ఇప్పటివరకు ఆ శిశువుల తల్లులెవరో తెలుసుకునే దిశగా ఇంతేజార్గంజ్ పోలీసులు అడుగు ముందుకేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో వరంగల్ వాసులు రుద్రారపు స్వరూప, ఓదెల అనిత, విజయవాడ వాసి శారదతోపాటు గుజరాత్, మహారాష్ట్రకు చెందిన అనురాధ అక్షయ్ కోరి, సల్మా యూనిస్ షేక్ అలియాస్ హారతి, పాట్నీ శైలబేన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించి ఆ శిశువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసుకొని వారి వద్దకు చేర్చాల్సి ఉంది. కానీ పోలీసులు ఆ కేసును పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ శిశువులను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చామని పట్టుబడిన నిందితులు చెప్పినప్పటికీ పోలీసులు ఆ దిశగా విచారణ చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని ప లువురు విమర్శిస్తున్నారు. తీగ లాగితే.. డొంక కదులుద్ది! వరంగల్ కేంద్రంగా అంతర్రాష్ట అక్రమ రవాణా ముఠా కదలికలున్నాయని పోలీసులకు ఈ అరెస్టుతో తెలిసినా.. వాటి మూలాలను వెలికితీసే దిశగా చొరవ చూపడం లేదు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తే ఇక్కడి లోకల్ ఏజెంట్ల గుట్టు రట్టవుతుంది. ఆశ వర్కర్ స్వరూప, స్వయం సహాయక మహిళా సంఘం లీడర్ అనితతోపాటు ఇతర రాష్ట్ర నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే.. ముఠాకు సంబంధించిన వివరాలు దొరికే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరిస్తే ముఠా మూలాలు, శిశువుల తల్లులు దొరికే అవకాశం ఉందని పలువురు పేర్కొటున్నారు. -
కోరాపుట్ టు నాసిక్
మియాపూర్: ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర నాసిక్‌కు గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన వికాస్‌జాదవ్, ఒడిస్సా, మోహిపాల్పుట్కు చెందిన సుభాష్‌కుమార్, మహారాష్ట్రకు చెందిన చెందిన అశోక్‌కూలే, అమోల్, విలాస్ జగనాథ్ పచోరే, ఫిరోజ్ మోమిన్, సుధామ్ గౌటేకర్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాహుల్ కుమార్‌సింగ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఏజెన్సీ నుంచి నాసిక్‌కు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్కడ కిలో గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి రూ. 20 వేలకు విక్రయిస్తున్నారు. కోరాపుట్‌లో సుభాష్‌కుమార్ గంజాయి సాగు చేస్తుండగా వికాస్ జాదవ్ అతడి నుంచి గంజాయి కొనుగోలు చేసి అశోక్‌కూలే, అమోల్‌కు అప్పగించేవాడు. వారు విలాస్జగనాథ్, రాహుల్ కుమార్, ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో నాసిక్‌కు గంజాయి తరలించేవారు. వారం రోజుల క్రితం వికాస్ జాదవ్, సుభాష్‌కుమార్ 800 కిలోల గంజాయిని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేయాలని నిర్ణయించారు. వికాస్ జాదవ్, అశోక్‌కూలే, అమోల్‌కు ఈ విషయం చెప్పడంతో వారు జగన్నాథ్, రాహుల్‌కుమార్ సింగ్‌లకు ఫోన్ చేసి తమ ప్లాన్‌ను వివరించారు. ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో గంజాయిని ఐదు కిలోల చొప్పున 156 ప్యాకెట్లుగా సిద్ధం చేశారు. ఈ నెల 19న అశోక్‌కూలే, రాహుల్‌కుమార్ సింగ్ కారులో ముందు వెళుతుండగా, విలాస్ జగన్నాథ్, సుధామ్ డీసీఎంలో వారిని అనుసరించారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎం పై భాగంలో అల్లం సంచులను లోడ్ చేశారు. టోల్ ప్లాజాల వద్ద పోలీసుల నిఘా ఉంటుందనే అనుమానంతో ఇతర హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, మియాపూర్ పోలీసులు మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై కారు, డీసీఎంను ఆపారు. కారులో ఉన్న అశోక్‌కూలే, రాహుల్కుమార్సింగ్లను అదుపులోకి తీసుకుని విచారించగా డీసీఎంలో 800 కిలోల గంజాయిని నాసిక్‌కు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అశోక్‌కూలే, అమోల్, రాహుల్‌కుమార్ సింగ్, విలాస్జగనాథ్, ఫీరోజ్ మోమిన్, సుధామ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులు వికాస్‌జాదవ్, సుభాష్‌కుమార్ పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటున్నామని సీపీ తెలిపారు. ♦ 800 కిలోల గంజాయితో పాటు డీసీఎం, ఐ 20 కారు, ఐదు మొబైల్స్, రూ.2,130 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీ మియాపూర్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐ తిరుపతిరావు, ఎస్ఓటీ సీఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
రేపటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునరుద్ధరణ
-
అంతర్రాష్ట్ర సర్వీసులపై చర్చ
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించే విషయంపై చర్చించేందుకు సోమవారం రెండు ఆర్టీసీల ఎండీలు సమావేశం కానున్నారు. బస్‌భవన్‌లో గాని.. ఎర్రంమంజిల్ ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో గాని ఈ భేటీ జరగనుంది. తొలుత ఓ పర్యాయం విజయవాడలో, ఆ తర్వాత బస్‌భవన్ లో ఈడీల స్థాయిలో సమావేశాలు జరిగాయి. కానీ చర్చలు పూర్తిగా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు టీఎస్ఆర్టీసీ కంటే లక్ష కిలోమీటర్ల మేర ఎక్కువగా అంతర్రాష్ట్ర ట్రిప్పులు తిరుగుతున్నాయి. దీన్ని తెలంగాణ ఆర్టీసీ తప్పుపడుతోంది. రెండు ఆర్టీసీలు సమంగా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేలా ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది. దీనికి ఏపీఎస్ ఆర్టీసీ సమ్మతించినా... సమంగా చేసే విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. లక్ష కిలోమీటర్ల మేర తెలంగాణ బస్సులు కూడా ఏపీ పరిధిలో తిప్పితే సరిపోతుందని ఏపీ ఆర్టీసీ పేర్కొంటోంది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నందున, అదనంగా అన్ని కిలోమీటర్ల మేర బస్సులు తిప్పటం కుదరదని, ఏపీ అంతమేర తక్కువగా తిప్పాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మధ్యేమార్గంగా తాము 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, తెలంగాణ 50 వేల కి.మీ. మేర పెంచుకుంటే సరిపోతుందని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. దీనికీ తెలంగాణ అధికారులు సమ్మతిచడం లేదు. ఈ నేపథ్యంలో సయోధ్య కుదిరేలా ఇరు ఆర్టీసీల ఎండీలు భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల భేటీ సోమవారం ఉంటుందంటూ వార్తలు వెలువడ్డాయి. దీన్ని తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖండించారు. ఎండీల స్థాయిలోనే సమావేశం కోసం మాత్రమే అంగీకరించామని వెల్లడించారు. -
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..
సాక్షి, విజయవాడ: అంతర రాష్ట్ర బస్సు సర్వీసులపై ప్రాథమిక చర్చలు జరిగాయని ఏపీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య 4 దశల్లో ఆపరేషన్స్ ప్రారంభించాలని చూస్తున్నామని వెల్లడించారు. 256 సర్వీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు నడపాలనే దిశగా ఆలోచనలు చేస్తున్నామని పేర్కొన్నారు. మరోసారి భేటీ అనంతరం స్పష్టత వస్తుందని చెప్పారు. (ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు) వచ్చే వారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. ప్రోటోకాల్ తప్పక పాటిస్తామన్నారు. విభజన జరిగినప్పుడు ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్ కాలేదని, దాని మీద కూడా చర్చ జరిగిందని బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. -
వలస కూలీలు: కీలక మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలకు సంబంధించి కేంద్రహోంశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి పలు రంగాలకు సడలింపు ఇచ్చినా.. వలస కూలీలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నారో అక్కడే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వలస కూలీలు ఉన్నచోటనే వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధిహామీలో పని కల్పించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వలస కూలీలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనుమతి ఇవ్వకూడదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రం దాటి మరో రాష్ట్రానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖ కోరింది. అయితే ప్రస్తుతం వలస కూలీలు ఎక్కడున్న ఉపాధి పొందేలా స్థానిక అధికారులతో పేరు నమోదు చేయించుకోవాలని కేంద్ర సూచించింది. అలాగే అవసరమైనతే వారికి ప్రత్యేక క్యాంపులు సైతం ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకోవాలని కోరింది. కాగా ఏప్రిల్ 20 తరువాత నిర్మాణ, గ్రామీణ ఉపాధి, పరిశ్రమల్లో కార్యాకలాపాలకే అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వలస కూలీలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. పలు చోట్ల తింటానికి కూడా తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. -
కలెక్టర్ల భేటీలో కాగ్నా వివాదానికి తెర!
బషీరాబాద్: కాగ్నా నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాద్గిరా– పోతంగల్ దగ్గర కాగ్నా నదిలో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఇసుక తవ్వకాలు గురువారం వివాదాస్పదమైన సంగతి విదితమే. సరిహద్దుల విషయంలో బషీరాబాద్ చించొళ్లీ రెవెన్యూ, పోలీసుల మధ్య వాగ్వాదాలతో సమస్య మరింత జఠిలమవ్వడంతో, చివరకు వికారాబాద్, గుల్బర్గా జిల్లాల కలెకర్లు ఉమర్ జలీల్, జి. వెంకటేశ్ కుమార్ రంగంలోకి దిగారు. శుక్రవారం వివాదాస్పద కాగ్నా నదిలో ఇరువురు జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇరురాష్ట్రాల సరిహద్దు నక్షలు, భూ రికార్డులను పరిశీలించారు. అయితే రెండు రాష్ట్రాల నక్షల ప్రకారం తమకంటే తమకే ఎక్కువ వాటాలు వస్తాయని ఏడీఎస్ఎల్ఆర్ అధికారులు తెలిపారు. వీటితో సమస్య పరిష్కారం కాదని భావించిన ఇద్దరు కలెక్టర్లు రాజీ మార్గంగా ఉమ్మడి సర్వే చేయించి నదిలో సమాన భూ భాగం పంచుకోవడానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. నదికి ఇరువైపులా ఉన్న రైతుల పట్టాభూముల బౌండరీలను గుర్తించి, మిగిలిన నదీ భాగంలో రెండు సమాన భాగాలుగా పంచుకోవాలని నిర్ణయించారు. వెంటనే కలెక్టర్లు, నదిలో కర్ణాటక అధికారులు పాతిన హద్దురాళ్లు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉండాలన్నారు. రెండు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు ఎక్కడ ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకుంటామని సంయుక్తంగా ప్రకటించారు. నదీ భూ భాగంలో ఇరు ప్రభుత్వాలకు సమాన వాటా తీసుకోవడానికి అంగీకరించామని, ఇక సరిహద్దు సమస్య ఏమీ ఉండదన్నారు. నీళ్లపల్లి దగ్గర అటవీ భూమికి చెందిన సరిహద్దు సమస్యను కూడా త్వరలో తేలుస్తామని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 10 నుంచి 30 మీటర్లు చొచ్చుకొచ్చిన కన్నడిగులు... కాగ్నాలో రెండు జిల్లాల సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్లు నరహరిరావు, జిదగేధర్ ఆధ్వర్యంలో డీజీపీఎస్ శాటిలైట్ సర్వేచేశారు. నదికి ఇరువైపుల ఉన్న కాద్గిరా – పోతంగల్ గ్రామాల రైతుల పట్టా భూముల హద్దులను గుర్తించారు. మిగిలిన నదీ భాగంలో సర్వే చేయగా కర్ణాటక అధికారులు కిలోమీటరు పొడవులో 10 నుంచి 30 మీటర్ల మేర తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు బహిర్గతమైంది. దీంట్లో కొంత మేర తెలంగాణ నదీభాగంలో కన్నడిగులు ఇసుక తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. నదికి ఇరువైపులా ఉన్న హద్దులతో రెండు రాష్ట్రాలకు సమాన భాగాలను గుర్తించి హద్దురాళ్లు పాతారు. కార్యక్రమంలో సేడం రెవెన్యూ అసిస్టెంట్ కమిషనర్ బి.సుశీల, గుల్బర్గా ట్రైనీ కలెక్టర్ సుధర్ స్నేహల్‌లొకండే, తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, మైన్స్ అధికారులు రేణుకాదేవి, రవికుమార్, జియాలజిస్ట్ రామారావు, చించొళ్లీ, బషీరాబాద్ తహసీల్దార్లు పండిత్ బీరాధర్, ఉమామహేశ్వరి, డీఎస్పీలు రామచంద్రుడు, బస్వరాజు రెవెన్యూ, మైన్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర చీటింగ్ ముఠా అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీ లోన్స్, మెడిల్ సీట్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. హైదరాబాద్, చెన్నై నగరాల్లోని 9 పోలీస్ స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రజల నుంచి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు సతీషన్, రాం నివాస్, హరి నివాస్‌ల వద్ద నుంచి 45 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజన్ కుమార్ తెలిపారు. -
అంతర్రాష్ట్ర మట్కా గుట్టు రట్టు
అనంతపురం సెంట్రల్: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతా ల్లోని అమాయకులకు అత్యాశచూపి వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్న అంతర్రాష్ట్ర మట్కా కంపెనీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. హుబ్లీ కేంద్రంగా అనంతపురం, కర్నూలు జిల్లాలో మట్కా ఆడిస్తున్న అంతర్రాష్ట్ర మట్కా నిర్వాహకుడు, గంజాయి విక్రేతలతో సహా మొత్తం ఆరుగురిని అనంతపురం వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు కిలోల గంజాయి, రూ. 20.25 లక్షల నగదు, కారు, మూడు సెల్ఫోన్లు, మట్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను శుక్రవారం పోలీసుకాన్ఫరెన్స్‌హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో వినాయక్ మేత్రాని (కర్ణాటక రాష్ట్రం హుబ్లీ), తమటం రమేష్ గౌడ్ (కర్నూలు జిల్లా డోన్), హబీబ్‌ఖాన్ (గుత్తి), జమాల్‌బాషా (హుబ్లీ), పట్నూరు షబ్బీర్‌బాషా (అనంతపురం రూరల్ మండలం పిల్లిగుండ్ల కాలనీ), పోతుల శంకర్ (బిందెల కాలనీ) ఉన్నారు. గుట్టు రట్టయ్యిందిలా.. అరెస్టయిన వారిలో వినాయక్ మే త్రాని అంతర్రాష్ట్ర మట్కా నిర్వాహ కుడు, గంజాయి విక్రేత. కర్ణాటక రా ష్ట్రం ధార్వాడ కేంద్రంగా మట్కా ని ర్వహిస్తున్నాడు. ఇతని కంపెనీకి అనుబంధంగా పట్టుబడిన మిగతా నిందితులు అనంతపురం, గుత్తి, క ర్నూలు జిల్లా డోన్లలోగుట్టుచప్పు డు కాకుండా మట్కా కొనసాగిస్తున్నారు. అమాయక ప్రజల అత్యాశ ను పెట్టుబడిగా మలుచుకొని రూ. కోట్లు అర్జిస్తున్నారు. దీంతో పాటు గంజాయిని కూడా విక్రయిస్తూ అమాయకులను మత్తుకు బానిస చేస్తున్నారు. మట్కా మహమ్మారి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అశోక్కుమార్నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. శుక్రవారం చెరువుకట్ట కింద నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో డీఎస్పీ వెంకట్రావ్ పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ భాస్కర్‌గౌడ్, రూరల్‌సీఐ కృష్ణమోహన్, ఎస్ఐలు హమీద్‌ఖాన్, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు సిబ్బంది ప్రత్యేక బృందంగా వారిని అరెస్ట్ చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్ కేసు.. అంతర్రాష్ట్ర మట్కా కంపెనీ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడం జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లా మట్కాను పూర్తిగా నిర్మూలిం చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే వారి పై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన డీఎస్పీ వెంకట్రావ్, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను ఎస్పీ ప్రశంసించారు. జిల్లాలో ఎక్కడైనా ఈ తరహా నేరాలు జరుగుతుంటే డయల్–100, 9989819191 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ఫిబ్రవరి 1నుంచే ఇ-వే బిల్లు
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్ను పరిధిలో ఇ-వే బిల్లు విధానాన్ని కచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం జరిగిన ఈ సమావేశంలో ఇ-వే బిల్లు విధానాన్ని తప్పని సరిచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంట్రా-స్టేట్ ఇ-వే బిల్లు జూన్ 1 నుంచి తప్పనిసరి చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వస్తువుల అంతర్ రాష్ట్ర ఇ-వే బిల్లు మాండేటరీ అని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. దీన్ని ట్రయల్ రన్ కోసం జనవరి 16నాటికి సిద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇ-వే బిల్లు విధానం, ఇన్వాయిస్ మ్యాచింగ్ తదితర అంశాలపై చర్చించిన 24వ జీఎస్టీ మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రూ. 50వేల విలువకంటే ఎక్కువ వస్తువులను రవాణా చేస్తే తప్పనిసరిగా ఇ-వే బిల్లు, రాష్ట్రంలో 10 కి.మీ లోపు వస్తువులను రవాణా చేస్తే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు ఉండాలి. కొన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 1 నుంచి స్వచ్ఛంద ప్రాతిపదికన ఇంటర్-స్టేట్ , ఇంట్రాస్టేట్ ఇ-వే బిల్లును అమలు చేస్తాయని కౌన్సిల్ తెలిపింది. అయితే ఇంట్రా స్టేట్ ఇ-వే బిల్లు విధానం మాత్రం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా అంతర్ రాష్ట్ర వస్తువుల రవాణా, పన్నుల ఎగవేత నిరోధాన్ని ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 1 నుంచి దశలవారీగా..ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. దీనిపై రివ్యూ నిర్వహించిన మండలి ఈ నిర్ణయం అమలు ఫిబ్రవరికి ప్రీ పోన్ చేసింది. అలాగే నవంబరులో గువాహటిలో జరిగిన గత మండలి సమావేశంలో 178 వస్తువులపై పన్ను రేట్లు తగ్గించిన విషయం తెలిసిందే. -
పగలే ఇళ్లు దోచుకుంటున్న అంతరాష్ట్ర దొంగ
-
అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ప్రారంభం
దాచేపలి, న్యూస్‌లైన్: ఆంద్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రవాణశాఖ తనిఖీ కేంద్రా న్ని ఏర్పాటుచేశామని గుంటూరు ఉపరవాణా కమిషనర్ డాక్టర్ వి.సుందర్ తెలిపారు. గామాలపాడు పంచాయతీ పరిధిలోని జేపీ సిమెంట్స్ సమీపంలో రవాణా చెక్‌పోస్టును సోమవారం ఏర్పాటు చేశారు. డీటీసీ సుందర్ ప్రత్యేకంగా పూజలుచేసి ఈ చెక్‌పోస్టును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీటీసీ సుందర్ మాట్లాడుతూ విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఇక్కడ చెక్‌పోస్టును ఏర్పాటుచేశామన్నారు. ప్రభుత్వం నుంచి విధివిధానాలు వచ్చిన తరువాత చెక్‌పోస్టు నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామన్నారు. 24 గంటలపాటు చెక్‌పోస్టులో సిబ్బంది ఉంటారని, పగలు ఏడుగురు, రాత్రి సమయంలో ఇద్దరు విధులు నిర్వహిస్తారని చెప్పారు. ఇన్చార్జిగా మాచర్ల ఎంవీఐ సీహెచ్ రాంబాబు వ్యవహరిస్తారని తెలి పారు. ప్రారంభ కార్యక్రమంలో గుంటూరు ఆర్టీవో బి.చందర్, ఎంవీఐలు టి.ఉమామహేశ్వరావు, ఎం.బాలమురళీకృష్ణ, బి.సత్యనారాణప్రసాద్, బి.గోపినాయక్, ఎం.రామచంద్రరావు, ఏఎంవీఐ లు ఎన్.గోపాల్, ఎన్.ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు. బోర్డుల ఏర్పాటు.. జేపీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రవాణా శాఖకు చెందిన చెక్‌పోస్టును ఏర్పాటు చేయడంతో ఆ శాఖ అధికారులు రోడ్డుపై తగిన చర్యలు తీసుకున్నారు. చెక్‌పోస్టు పరిసరాల్లో రోడ్డుకు ఇరువైపులా చెక్‌పోస్టు ఉన్నట్లు బోర్డులు ఏర్పాటుచేశారు. మాచర్ల టౌన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో మాచర్ల కొత్తపల్లి జంక్షన్ వద్ద సోమవారం ఉదయం అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టును రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. తెలంగాణ సరిహద్దు అయిన మాచర్ల ప్రాంతంలో తాత్కాలికంగా చెక్‌పోస్టును ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రవాణా శాఖ అధికారులు కొత్తపల్లి జంక్షన్ నూతన ఆర్టీవో కార్యాలయ సమీపంలో తాత్కాలిక చెక్‌పోస్టు నిర్మాణం చేశారు. నరసరావుపేట ఆర్టీవో రామస్వామి పూజలు జరిపి చెక్‌పోస్టును ప్రారంభించారు. అనంతరం లాంఛనంగా వాహనాలను తనిఖీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా నూతనంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తాత్కాలికంగా చెక్‌పోస్టు ఏర్పాటుచేసినట్లు రామస్వామి తెలిపారు. మార్చి వరకు ఈ చెక్‌పోస్టును ఇక్కడ కొనసాగించి ప్రభుత్వం భూమి కేటాయించిన ప్రాంతంలో పూర్తిస్థాయి చెక్‌పోస్టును ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి ఐదారు వందల వాహనాలు ప్రతిరోజూ వస్తాయని తమ సర్వేలో తేలిందన్నారు. కార్యక్రమంలో ఎంవీఐలు టి.రాఘవరావు, మల్లేశ్వరి, కేసీపీ రవాణా శాఖ ఇన్చార్జి చంద్రశేఖర్, అర్చకులు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
జహీరాబాద్ టౌన్, న్యూస్‌లైన్: వరుసగా పలు బ్యాంకుల్లో దొంగతనాలకు పాల్పడుతూ, వాహనాలను అపహరిస్తూ ప్రజలను భయందోళనకు గురి చేస్తున్న ఓ అంతర్ రాష్ర్ట దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. దొంగల నుంచి నగదు, ఇన్నోవా వాహ నం, తూటాలు, కత్తులు, గ్యాస్, ఆక్సిజన్ సిలిండర్, డ్రిల్లింగ్ మిషన్ తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సంబంధించిన వివరాలను ఆదివారం జహీరాబాద్ పోలీసు స్టేషన్లో జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ రావు వెల్లడించారు. కర్నాటక రాష్ర్టం గుల్బర్గాకు చెందిన ఘోరే మహబూబ్, అబ్దుల్ రజాక్, చాంద్‌పాషా, మహమూద్, షఫీ, ఖలీద్, బాబా, ఖాల మహబూబ్లు ఓ ముఠాగా ఏర్పడి బ్యాంక్ దోపిడీలతో పాటు వాహనాల చోరీలకు పాల్పడుతున్నారు. గుల్బ ర్గా పట్టణంలోని టిప్పుసుల్తాన్ చౌక్, అలంద్ చౌక్‌లో నివాసముంటున్న వీరు మూడేళ్ల నుంచి ఏ టూ జెడ్ పేరుతో స్క్రాప్ షాపు నడుపుతున్నారు. దుకాణం కేంద్రంగా చేసుకొని బ్యాంక్ దోపిడీలు, ట్రాక్టర్లు, కార్లు, డీసీఎం వ్యాన్లు, టాటా సుమోల చోరీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత సంవత్సరం జహీరాబాద్ మం డలంలోని కొత్తూర్(బి) సిండికేట్ బ్యాం క్లో దొంగతనం చేశారు. బ్యాంక్ వెనుక భాగంలోని కిటికీ గుండా బ్యాంక్‌లోకి ప్రవేశించి ఆక్సింజన్ సిలిండర్, గ్యాస్‌కట్టర్ సాయంతో లాకర్‌ను ధ్వంసం చేశా రు. అందులో ఉన్న రూ.3,70 లక్షలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఆక్సిజన్ సిలిండర్ అక్కడే వదిలివెళ్లారు. అదేనెలలో కోహీ ర్ మండలంలోని కవేలి గ్రామంలోని సిండికేట్ బ్యాంక్‌లో దొంగతనానికి యత్నించగా సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశం అక్కడికి చేరుకుని వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దుండగులు జరిపిన కాల్పుల్లో ఎస్ఐ గాయపడిన విషయం విదితమే. జులై నెలలో మండలంలోని మల్చెల్మా సిండికేట్ బ్యాంక్‌లో కూడా చోరీకి యత్నించి విఫలమైయ్యారు. అలాగే సంగారెడ్డి, సదాశివపేట,తూఫ్రాన్లతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మహ్మదాబాద్ పో లీస్ స్టేషన్ పరిధిలో టాటా సుమో, ట్రా క్టర్,డీసీఎం వ్యాన్ తదితర వాహనాలను అపహరించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందున్న ఏటీఎంలో కూడా చోరీకి విఫలయత్నం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. కాగా ఆది వారం జహీరాబాద్ పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాలను తనఖీ చేస్తుండగా దానిలో భాగంగా కేఏ 01 ఎంసీ2053 నంబర్‌గల ఇనోవా కారు ను ఆపి తనిఖీచేశారు. అందులోని వ్యక్తుల ప్రవర్తన తీరు అనుమానం కలిగించడంతో వారిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ మేరకు వారి వద్ద ఉన్న 1,83,600 రూపాయల నగదు, రెండు ఆక్సిజన్, ఒకటి ఎల్పీజీ సిలిండర్, గ్యాస్ కట్టర్, ఆక్సాబ్లేడ్లు, రెండు కత్తులు, డ్రిల్లింగ్ మిషన్, గడ్డపార, చేతి గ్లౌస్లు, తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ రావు తెలిపారు. నిందితులు ఘోరె మహబూ బ్, అబ్దుల్ రజాక్, చాంద్‌పాషా, మహమూద్, షఫీలను అరెస్టు చేశామన్నారు. ఎస్ఐ వెంకటేశంపై కాల్పులు జరిపిన బాబాతో పాటు ఖలీద్, కాల మహబూబ్లు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ దొంగల ముఠాను పట్టుకొన్న జహీరాబాద్ టౌన్ సీఐ నరేందర్, పట్టణ ఎస్ఐ శివలింగం,పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు. సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ వెంకటేశం, పలువురు ఎస్ఐలు ఉన్నారు.