సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలకు సంబంధించి కేంద్రహోంశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి పలు రంగాలకు సడలింపు ఇచ్చినా.. వలస కూలీలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నారో అక్కడే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వలస కూలీలు ఉన్నచోటనే వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధిహామీలో పని కల్పించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వలస కూలీలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనుమతి ఇవ్వకూడదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రం దాటి మరో రాష్ట్రానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖ కోరింది.
అయితే ప్రస్తుతం వలస కూలీలు ఎక్కడున్న ఉపాధి పొందేలా స్థానిక అధికారులతో పేరు నమోదు చేయించుకోవాలని కేంద్ర సూచించింది. అలాగే అవసరమైనతే వారికి ప్రత్యేక క్యాంపులు సైతం ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకోవాలని కోరింది. కాగా ఏప్రిల్ 20 తరువాత నిర్మాణ, గ్రామీణ ఉపాధి, పరిశ్రమల్లో కార్యాకలాపాలకే అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వలస కూలీలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. పలు చోట్ల తింటానికి కూడా తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment